»   »  ‘వూపిరి’ ఆడియో విడుదల తేదీ, వెన్యూ

‘వూపిరి’ ఆడియో విడుదల తేదీ, వెన్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అక్కినేని నాగార్జున, కార్తీ కాంబినేషన్ లో తమిళ తెలుగు భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘వూపిరి'. తమన్నా హీరోయిన్ గా చేసిన ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను మార్చి 1న నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మించారు. గోపి సుందర్‌ సంగీతం సమకూర్చారు.

హాలీవుడ్ మూవీ ‘ది ఇంటచబుల్స్' కి రీమేక్ గా ఊపిరి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఎక్కువ భాగం వీల్ చెయిర్ లోకనిపిస్తాడు. ఈ సినిమాలో వీరితో పాటు ఓ ముఖ్య పాత్రలో అనుష్క - అడవి శేష్ జంటగా కనిపించనున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

నాగార్జున మాట్లాడుతూ ''ఈ మధ్య కాలంలో ఇలాంటి కథ వినలేదు. వంశీ కథ చెప్పగానే చాలా ఉద్వేగానికి లోనయ్యా. మల్టీస్టారర్‌చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంద''న్నారు.

'Oopiri' gears up for a music launch on 1st March

''నా సినిమాలన్నీ తెలుగులో అనువాద రూపంలో విడుదలయ్యాయి. తెలుగులో నేరుగా చేస్తున్న తొలి సినిమా ఇది. నాగార్జునగారితో తెర పంచుకోవడం ఆనందంగా ఉంద''ని కార్తి తెలిపారు.

''నాగార్జున, కార్తి ఈ సినిమా చేస్తామని ముందుకు రావడంతో సగం విజయం సాధించినంత ఆనందంగా ఉంది. నేను రాసుకొన్న పాత్రలకు వాళ్లయితేనే పూర్తిగా న్యాయం చేస్తారనిపించింద''న్నారు వంశీ పైడిపల్లి.

ఈ చిత్రానికి సంగీతం: గోపి సుందర్‌, ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, మాటలు: అబ్బూరి రవి, కూర్పు: శ్రీకర ప్రసాద్‌.

English summary
Vamshi Paidipalli's magnum opus, Oopiri, is all set to have a grand audio launch. Producers PVP Cinema have announced that the audio of Oopiri will be launched on the 1st of March at Novotel Hitex Convention Centre.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu