»   »  ‘ఊపిరి’ మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉంది?

‘ఊపిరి’ మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున, కార్తీ, త‌మ‌న్నా కాంబినేష‌న్లో రూపొందిన మల్టీస్టార‌ర్ మూవీ 'ఊపిరి' ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైంది. వంశీ పైడిప‌ల్లి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్ పి.వి.పి నిర్మించారు. ఊపిరి ఫ్రెంచ్ ఫిలిం రీమేక్. నాగ్, కార్తీ నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం కావడంతో సినిమాపై ముందు నుండీ మంచి అంచనాలే ఉన్నాయి.

దీనికి తోడు ఈ చిత్రం పబ్లిసిటీ విషయంలో 'పివిపి' సంస్థ స్పెషల్ కేర్ తీసుకుంది. ఫోటోషూట్, ట్రైలర్స్, టీజర్ మేకింగ్, పోస్టర్ మేకింగ్ అంటూ ఇలా ఆర్భాటాలు చేసారు. వీటి ఫలితంగా సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ దక్కించింది. ఇవన్నీ ఓపెనింగ్స్ పరంగా బాగా కలిసొస్తాయని భావిస్తున్నారు.

ప్రీమియర్ షోల నుండి అందుతున్న సమాచారం ప్రకారం..... 'ఊపిరి' చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్సాన్స్ వస్తోంది. నాగార్జున, కార్తి పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టారని అంటున్నారు. ఇక తమన్నా గ్లామర్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకుందని తెలుస్తోంది.

Oopiri movie public Talk

ఫ్రెంచి సినిమాకు రీమేక్ అయినా.....దర్శకుడు వంశీ మన నేటివిటీకి తగిన విధంగా సినిమాను బాగా తీసాడని అంటున్నారు. అయితే సినిమా సెకండాఫ్ కాస్త స్లోగా ఉందని అంటున్నారు. సినిమా నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయని, సినిమాటోగ్రఫీ హైలెట్ గా ఉందని అంటున్నారు.

ఇప్పటి వరకు తెలుగులో రొటీన్ సినిమాలు చూసిన ప్రేక్షకులకు...'ఊపిరి' చిత్రం సరికొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు. కథ, కథనం, నటీనటుల పెర్ఫార్మెన్స్, సంగీతం ఇలా అన్ని విధాలుగా ఊపిరి బావుందని, నాగార్జున కెరీర్లో మరో హిట్ పడిపోయిందని అంటున్నారు. సినిమా పూర్తి రివ్యూ మరికాసేపట్లో....

English summary
Oopiri, the Telugu adaptation of the French film, The Intouchables, starring Nagarjuna, Karthi and Tamannaah is out in theaters near to you. Oopiri, is for all of you, who are waiting to breathe a fresh air in the Tollywood.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu