»   » నాగార్జున కెరీర్లోనే గ్రేట్ కలెక్షన్.... మొత్తం 100 కోట్లు!

నాగార్జున కెరీర్లోనే గ్రేట్ కలెక్షన్.... మొత్తం 100 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఊపిరి'. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాల్ని రాబట్టింది. ఈ సినిమా తర్వాత కొన్ని పెద్ద సినిమాలు విడుదలైనా పోటీని తట్టుకుని నిలిచింది. ప్రస్తుతం అన్ని చోట్ల ఊపిరి బాక్సాఫీసు బిజినెస్ ముగిసింది.

బిజినెస్ పూర్తయిన తర్వాత ఈ సినిమాకు సంబంధించిన ఫలితాలు చూస్తే ఆశ్చర్యం వేయక మానదు. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఓవరాల్ టోటల్ షేర్ రూ. 63 కోట్ల వరకు వసూలు చేసింది.

నాగార్జున, ఊపిరి, కార్తి, తమన్నా

మనసుకు హత్తుకునే కథలో పాటు నాగార్జున, కార్తి, తమన్నా పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఇన్ టచబుల్స్ అనే ఫెంచి చిత్రాన్ని ఇన్స్‌స్పిరేషన్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినా...మన నేటివిటీకి తగిన విధంగా..యూత్, ప్యామిలీ మెచ్చే విధంగా సినిమాను తీర్చి దిద్దడంలో దర్శకుడు సినిమా సూపర్ హిట్టయింది.

ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు...

నైజాం - రూ. 8.46కోట్లు
సీడెడ్ - రూ. 3.26 కోట్లు
వైజాగ్ - రూ. 3.05 కోట్లు
ఈస్ - రూ. 1.97 కోట్లు
వెస్ట్ - రూ. 1.28 కోట్లు
క్రిష్ణ - రూ. 1.75కోట్లు
గుంటూరు -రూ. 2.11కోట్లు
నెల్లూరు - రూ. 0.89 కోట్లు
ఏపీ/తెలంగాణ టోటల్ - రూ. 22.77 కోట్లు(గ్రాస్ కలెక్షన్ 41.8కోట్లు)
తమిళనాడు : రూ. 14.90కోట్లు
కర్ణాటక- రూ. 4.80 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: రూ. 1.43కోట్లు
యూఎస్ఏ : రూ. 6.51కోట్లు
రెస్టాఫ్ వర్డ్ డ్ : రూ. 1.85కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ :63.47కోట్లు(గ్రాస్ 100.65 కోట్లు)

English summary
Nagarjuna, Karthi, Tamanna starrer 'Oopiri' Total world wide gross collections 100 cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu