»   »  బాలకృష్ణా ...మజాకా

బాలకృష్ణా ...మజాకా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Balakrishna
బాలకృష్ణ వరస ప్లాపుల్లో ఉన్నా ఆయన బిజినెస్ స్టామినా ఏ మాత్రం తగ్గ లేదు.తాజాగా ఆయన చిత్రం పాండురంగడు ఆంధ్రప్రదేశ్ ప్రదర్శనహక్కులు దాదాపు 22 కోట్లు కు అమ్ముడు పోయి రికార్డు సృష్టించింది. ముంబాయికి చెందిన ఇండియన్‌ఫిలింస్ అనే సంస్థ ఈ పెద్ద మొత్తం చెల్లించి కొనుగోలు చేసింది. ఇంతకు ముందు బాలకృష్ణ వై.వి.యస్ చౌదరి కాంబినేషన్ లో వచ్చిన ఒక్కమగాడు సినిమా కూడా 26 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి అందరినీ నివ్వెరపోయేలా చేసింది.అలాగే పాండురంగడు పౌరాణిక చిత్రం కావటం..ఒక్క మగాడు ఊహించని విధంగా దెబ్బ తినటం తో ఆంత క్రేజ్ రాదేమోనని పరిశ్రమ వర్గలు వారు అనుకున్నారు.కాని అందరి అంచనాలు తల క్రిందులు చేస్తూ 22 కోట్లు కి అమ్ముడు పోవటం జరిగింది. దాంతో బాలకృష్ణ సినిమాలు వరసగా ఫ్లాఫువుతున్నా వెంటనే ఎందుకు ప్రారంభమవుతున్నాయో ఇంత కాలం అర్ధం కాని వారికి సమాధానం దొరికినట్లయ్యింది. ఆయన క్రేజ్,గ్లామర్ సత్తా మరోసారి రుజువయ్యింది అంటున్నారు అభిమానులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X