Don't Miss!
- News
ఏపీ, తెలంగాణకు రైల్వే బడ్జెట్లో రూ. 12,800 కోట్లు: వాటాలు ఇలా, కీలక ప్రాజెక్టులు
- Sports
ILT20 2023: 6 బంతుల్లో 5 సిక్స్‌లు.. డ్రెస్సింగ్ రూమ్‌లో రచ్చ చేసిన యూసఫ్ పఠాన్!
- Finance
భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Technology
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Pathaan Day 1 Collection బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న పఠాన్.. షారుక్ ఖాన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ కలెక్షన్లు
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, గ్లామర్ క్వీన్ దీపిక పదుకోన్ నటించిన పఠాన్ చిత్రం హిట్ టాక్‌తో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. రిలీజ్‌కు ముందు ఏర్పడిన భారీ అంచనాలతో ఈ సినిమా అనూహ్యమైన ఓపెనింగ్స్ మొదలయ్యాయి. గత వారం రోజులుగా అడ్వాన్స్ బుకింగ్ పరంగా రికార్డులు తిరగరాసింది. జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్నది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా, ఆక్యుపెన్సీ వివరాలు ఎలా ఉన్నాయంటే?

పఠాన్‌పై భారీ అంచనాలు
షారుక్
ఖాన్‌కు
తప్పనిసరిగా
హిట్
కావాల్సిన
పరిస్థితుల్లో
పఠాన్
సినిమా
రిలీజైంది.
విడుదలకు
ముందు
ప్రేక్షకుల
ముందుకు
వచ్చిన
టీజర్లు,
ట్రైలర్లు
భారీ
క్రేజ్‌ను
క్రియేట్
చేశాయి.
యాక్షన్
ఎపిసోడ్స్,
షారుక్
ఖాన్
సిక్స్
ప్యాక్,
జాన్
అబ్రహం
విలనిజం,
దీపిక
పదుకోన్
గ్లామర్
సినిమాకు
ప్రత్యేక
ఆకర్షణగా
మారాయి.
దాంతో
ఈ
సినిమాపై
భారీ
అంచనాలు
ఏర్పడ్డాయి.

వివాదాల సుడిగుండంలో పఠాన్
పఠాన్ సినిమాపై ఏర్పడిన భారీ అంచనాలు, ఈ సినిమా పాటలు, హీరోయిన్ దుస్తులు, ఇతర అంశాలపై హిందు సంస్థల అభ్యంతరాలు లేవనెత్తడంతో సినిమా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. సెన్సార్ అభ్యంతరాలు, బాయ్‌కాట్ బాలీవుడ్, బాయ్ కాట్ పఠాన్ అంశాలు సినిమాను మరింత వివాదంలోకి నెట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో పఠాన్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్
పఠాన్ సినిమాపై వివాదాలు, అభిమానుల క్రేజ్ కొనసాగుతుండగా.. బాక్సాఫీస్ వద్ద రిలీజ్‌కు ముందే షారుక్ ఖాన్ మూవీ అనూహ్యమైన స్పందన కూడగట్టుకొన్నది. దాంతో ఈ సినిమా భారీగా అడ్వాన్స్ బుకింగ్ క్రియేట్ చేసింది. కేజీఎఫ్, పొన్నియన్ సెల్వన్ సినిమాలకు మించిన అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది. బాహుబలికి దరిదాపుల్లో ఈ సినిమా కలెక్షన్లు సాధించింది.

హిందీ వెర్షన్ ఆక్యుపెన్సీ
ఇక
పఠాన్
సినిమా
ఆక్యుపెన్సీ
విషయానికి
వస్తే..
హిందీ
వెర్షన్
మూవీకి
భారీ
ఆక్యుపెన్సీ
లభించింది.
ముంబైలో
33
శాతం,
ఢిల్లీలో
32
శాతం,
బెంగళూరులో
45
శాతం,
హైదరాబాద్‌లో
50
శాతం,
కోల్
కతాలో
70
శాతం,
చెన్నైలో
42
శాతం,
జైపూర్‌లో
44
శాతం,
లక్నోలో
35
శాతం,
చండీగఢ్‌లో
31
శాతం
అక్యుపెన్సీ
లభించింది.

తెలుగు, తమిళ వెర్షన్ ఆక్యుపెన్సీ
తెలుగు వెర్షన్ పఠాన్ మూవీకి ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 31 శాతం, విజయవాడలో 48 శాతం, వరంగల్‌లో 50 శాతం, గుంటూరులో 47 శాతం, వైజాగ్‌లో 35 శాతం, కాకినాడలో 32 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. తమిళ వెర్షన్ విషయానికి వస్తే. కోయంబత్తూరులో 31 శాతం, వెల్లూరులో 21 శాతం, చెన్నైలో 14 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

పఠాన్ తొలి రోజు కలెక్షన్ల అంచనా ఎంతంటే?
పఠాన్ సినిమాకు దేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా భారీ కలెక్షన్లు నమోదయ్యాయి. ఫ్రాన్స్, జర్మనీ, యూకే, కెనడా, యూఎస్, దుబాయ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో భారీగా అడ్వాన్సు బుకింగ్ నమోదైంది. తొలి రోజున ఈ సినిమా సుమారు 50 నుంచి 55 కోట్ల కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. తొలి వారాంతం లోపు 200 కోట్లు రాబట్టే ఛాన్స్ కనిపిస్తున్నది.