twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bheemla Nayak నాన్ థియేట్రికల్ బిజినెస్.. భారీ ధరకు కొనుగోలు చేసిన బడా సంస్థలు.. లాభం ఎంతంటే?

    |

    వకీల్ సాబ్ సినిమాతో గత ఏడాది భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి అంతకుమించి అనేలా భీమ్లా నాయక్ సినిమాతో రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. రానా దగ్గుబాటి కూడా ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఆ రూట్లోనే ఈ సినిమా పెట్టిన పెట్టుబడిలో సగానికిపైగా రికవరీ చేసినట్లుగా తెలుస్తోంది. భీమ్లా నాయక్ నాన్ థియేట్రికల్ హక్కులను ఏ సంస్థ అందుకుంది ఎన్ని కోట్లకు దక్కించుకుంది మొత్తంగా ఆ రూట్ లో ఎన్ని లాభాలు వచ్చాయి అనే వివరాల్లోకి వెళితే..

    మరింత పవర్ఫుల్ గా..

    మరింత పవర్ఫుల్ గా..

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుతాయి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆయనకు తోడు మరొక పవర్ఫుల్ హీరో కూడా వెండితెరపై కనిపిస్తే బాక్సాఫీస్ వద్ద మరింత పవర్ఫుల్ గా కలెక్షన్స్ వస్తాయి అని చెప్పవచ్చు. భీమ్లా నాయక్ సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

     సాంగ్స్ తో మంచి హైప్

    సాంగ్స్ తో మంచి హైప్

    మలయాళం ఇండస్ట్రీలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా మరింత పవర్ఫుల్ గా వస్తున్న భీమ్లా నాయక్ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో యువ నిర్మాత నాగవంశి నిర్మిస్తున్నాడు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి.

     రిలీజ్ పై మరో కన్ఫ్యూజన్

    రిలీజ్ పై మరో కన్ఫ్యూజన్

    ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన విడుదలవుతుందని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ వరుణ్ తేజ్ గని సినిమా ముందుగానే విడుదల తేదీని ప్రకటించడంతో ఆ రోజు వచ్చే అవకాశం లేదు అని మరొక కొత్త టాక్ కూడా వినిపిస్తోంది. ఫిబ్రవరి 25 న కుదరకపోతే ఏప్రిల్ 1న సినిమాను విడుదల చేయనున్నట్లుగా ఇదివరకే నిర్మాత నాగవంశి తెలియజేశాడు. మరి భీమ్లా నాయక్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

    శాటిలైట్, ఓటీటీ రైట్స్

    శాటిలైట్, ఓటీటీ రైట్స్

    ఇక సినిమాకు సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే ఇటీవల హాట్ స్టార్ సంస్థ భీమ్లా నాయక్ సినిమా ఓటీటీ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక స్టార్ మా అదే కంపెనీ కాబట్టి ఓటీటీ హక్కులతో పాటు శాటిలైట్ హక్కులను కలిపి ఒకేసారి భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది

    లాభాలు ఎంతంటే?

    లాభాలు ఎంతంటే?

    అయితే నాన్ థియేట్రికల్ గా భీమ్లా నాయక్ సినిమా ఏ స్థాయిలో లాభాలను అందించింది అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ బిజినెస్ లో సినిమా దాదాపు 70 కోట్ల వరకు లాభాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక సినిమా పెట్టిన పెట్టుబడి దాదాపు సగానికి పైగా నాన్ థియేట్రికల్ గానే లాభాలు అంధించినట్లు సమాచారం.

    Recommended Video

    Tollywood కి తెలంగాణాలో లేని సమస్యలు ఏపీ లో ఎందుకంటే - Comedian Ali Presmeet | Filmibeat Telugu
     థియేట్రికల్ గా కూడా..

    థియేట్రికల్ గా కూడా..

    ఇక సినిమా నాన్ థియేట్రికల్ గానే ఈ రేంజ్ లో లాభాలను అందించింది అంటే విడుదల తర్వాత బాక్సాఫీసు వద్ద ఇంకా భారీ స్థాయిలో లాభాలను అందిస్తుంఅంది అనడంలో సందేహం లేదు. తప్పకుండా బిజినెస్ 100 కోట్లను దాటుతుంది అని సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అందుకే మధ్యలో చాలా ఓటీటీ ఆఫర్స్ వచ్చినా కూడా టెంప్ట్ అవ్వకుండా నిర్మాత డైరెక్టుగా థియేటర్లలో భీమ్లా నాయక్ ను విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడు.

    English summary
    Pawan kalyan Bheemla nayak non theatrical bussiness details,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X