Don't Miss!
- News
తిరుమలలో డ్రోన్ కెమెరా కలకలం: వీడియో వైరల్, టీటీడీ ఏమందంటే.?
- Finance
wipro: అప్పుడు వెయిట్ చెయ్యమన్న విప్రో.. ఇప్పుడు వేటు వేసింది..
- Sports
ఆస్ట్రేలియా క్రికెటర్ వివాహేతర సంబంధం.. చెంపలు వాయించిన ప్రేయసి!
- Lifestyle
పీరియడ్స్ మిస్ అయ్యింది, కానీ నెగెటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్: కారణాలను ఏంటో ఇక్కడ తెలుసుకోండి
- Automobiles
సాధారణ ప్రజలనే కాదు కంపెనీ చైర్మన్ మనసు కూడా దోచేసిన Hero Vida.. స్కూటర్ డెలివరీ ఫొటోస్
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
- Technology
Apple ఫోన్లు ,ల్యాప్ టాప్ లు ,ఇతర గాడ్జెట్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల వివరాలు!
Box Office: పవన్ రీమేక్ సినిమాను దాటలేకపోయిన సర్కారు వారి పాట.. నష్టం ఎంతంటే?
బాక్సాఫీస్ వద్ద చాలా రోజులుగా స్టార్ హీరోల మార్కెట్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా మన హీరోలు వారి స్థాయిని పెంచుకునే విధంగా సినిమాలు చేస్తూ ఉన్నారు. యూఎస్ లో టాలీవుడ్ హీరోల మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. అయితే సర్కారు వారి పాట సినిమా మాత్రం పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమా రికార్డును కూడా బ్రేక్ చేయలేదని ప్రస్తుతం సోషల్ మీడియాలో కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.

ఓటీటీకి రిలీజ్
మహేష్ బాబు ఎంతో ఇష్టంగా చేసిన సర్కారు వారి పాట పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ అయితే గట్టిగానే అందుకుంది. కానీ ఆ తర్వాత పూర్తి స్థాయిలో మాత్రం పెట్టిన పెట్టుబడిని వెనక్కి తేలేకపోయింది. ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ఓటీటీ లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో దాదాపు బాక్సాఫీస్ వద్ద క్లోజ్ అయ్యేది పరిస్థితికి వచ్చేసింది.

మొదట్లో బాగానే వచ్చాయి
ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో సినిమాలో పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల చేసిన విషయం తెలిసిందే. మరో వారం రోజుల్లో అమెజాన్ ప్రైమ్ యూజర్స్ కు ఈ సినిమా ఉచితంగానే లభించనుంది. ఇక బాక్సాఫీస్ సర్కారు వారి పాట మొదటి వారంలో బాగానే వసూళ్లను సాధించినప్పటికీ అనంతరం ఒక్కసారిగా తగ్గుతూ వచ్చాయి. సినిమా టికెట్ల రేట్లు కూడా ఎక్కువగా ఉండడం తో ఓ వర్గం ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు అనే టాక్ కూడా వచ్చింది.

మహేష్ స్టార్ హోదాతో..
అంతేకాకుండా సినిమా పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేదు అని కూడా ఓ వర్గం ప్రేక్షకులు అప్సెట్ అయ్యారు. కథలో కొత్తదనం ఏమీ లేదు అని రొటీన్ కమర్షియల్ మూవీ అని కూడా అన్నారు. అయినప్పటికీ మహేష్ బాబు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన స్టార్ హోదాతోనే సినిమాకు వందకోట్ల కలెక్షన్స్ విశేషం

థియేట్రికల్ నష్టం ఎంత?
సర్కారు వారి పాట సినిమా మొత్తంగా జూన్ 4 వరకు వచ్చిన కలెక్షన్స్ తో కలిపి 110 కోట్ల వరకు షేర్ సాధించినట్లు సమాచారం. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ తో మార్కెట్ లోకి అడుగు పెట్టింది. ఇక సినిమా దాదాపు పెట్టిన పెట్టుబడికి 10 కోట్ల వరకు నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.

యూఎస్ లో ఎంతంటే?
ఇక యూఎస్ లో అయితే ఈ సినిమా ఊహించిన రేంజ్ లో వసూళ్లను అందుకుంటుంది అని కూడా అనుకున్నారు. ఇప్పటివరకు అమెరికా బాక్సాఫీస్ వద్ద అత్యధిక రికార్డులు తిరగ రాసిన తెలుగు హీరోలలో మహేష్ బాబు నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇక ఈ సినిమా ఓవర్సీస్ లో 2.30 మిలియన్ డాలర్స్ అందుకోవడం విశేషం.

పవన్ సినిమా కంటే తక్కువే..
అయితే ఒక విధంగా మహేష్ డైరెక్ట్ సినిమా యూఎస్ లో పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమా రేంజ్ లో కలెక్షన్లు అందుకోకపోవడం ఆశ్చర్యం. పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ భీమ్లా నాయక్ యూఎస్ లో 2.48 మిలియన్స్ డాలర్లు సొంతం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ లెక్కలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నాయి.