Don't Miss!
- Finance
notice peiod: నోటీసు పీరియడ్ కు 'NO' చెప్తే.. ఊ అంటారా.. ఉఊ అంటారా ?
- News
Vastu tips: ఇంట్లో మహిళలకు ఎప్పుడూ రోగాలా? ఈ వాస్తు దోషాలతోనే కావచ్చు!!
- Lifestyle
Today Rasi Palalu 24 January 2023: ఈ రోజు మిథున రాశి వారికి శుభవార్తలు, ఆర్థిక పరిస్థి గొప్ప మెరుగుదల
- Sports
సూర్యకుమార్ యాదవ్.. నా బెస్ట్ ఫ్రెండ్.. అతను నాలాగే ఇబ్బంది పడ్డాడు: సర్ఫరాజ్ ఖాన్
- Automobiles
యాక్టివా కొత్త వేరియంట్ విడుదల చేసిన హోండా మోటార్‌సైకిల్ - ధర & వివరాలు ఇక్కడ చూడండి
- Technology
ప్రపంచ వ్యాప్తంగా సేల్ అయ్యే ఐఫోన్లలో 25%, ఇండియా లోనే తయారీ!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
Kushi 3 days collections: కొత్త సినిమాల రేంజ్ లో కలెక్షన్స్.. పవర్ స్టార్ క్రేజ్ తో బాక్సాఫీస్ బ్లాస్ట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో ఒకటైన ఖుషి సినిమా ఇటీవల రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా రీ రిలీజ్ ట్రెండ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇప్పటికి కూడా బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తోంది అంటే క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2022 డిసెంబర్ 31 నుంచి ఖుషి 4K వెర్షన్ ను థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఇక జనవరి 1వ తేదీన మాత్రమే కాకుండా 2వ తేదీన కూడా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక టోటల్ గా 3 రోజుల్లో మొత్తంగా వచ్చిన కలెక్షన్స్ ఎంత అనే వివరాల్లోకి వెళితే..

సినిమా వచ్చి 20 ఏళ్లయినా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భూమిక జంటగా నటించిన ఖుషి సినిమా అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమా వచ్చి 20 ఏళ్లయినా కూడా అందులోని సన్నివేశాలు పాటలు ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ మర్చిపోరు. ఈ జనరేషన్ వారిని కూడా ఆ సినిమా ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇక అలాంటి సినిమాను మళ్ళీ విడుదల చేసినా కూడా అదే స్థాయిలో క్రేజ్ అందుకోవడం విశేషం.

ఫ్యాన్స్ కోరిక మేరకు
నిర్మాత AM రత్నం ఖుషి సినిమాను గతంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు జల్సా సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఇక న్యూ ఇయర్ సందర్భంగా అప్డేట్ చేసి సినిమాను కొన్ని లిమిటెడ్ థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఫ్యాన్స్ నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కువ థియేటర్లలోనే విడుదల చేయడం జరిగింది.

3వ రోజు కలెక్షన్స్
ఖుషి సినిమా మళ్లీ విడుదలైనా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోవడం విశేషం. కొత్తగా వచ్చిన సినిమాలతో పోటీ పడుతూ కోట్లల్లో కలెక్షన్స్ రాబట్టడం అంటే అంత మాములు విషయం కాదు. ఇక న్యూ ఇయర్ ముందు రోజు విడుదలైన ఈ సినిమా ఆరోజు 3.62 కోట్లను అందుకోగా రెండవ రోజు 1.52 కోట్లను కలెక్ట్ చేసింది. ఇక మూడవరోజు అంటే సోమవారం రోజు 54 కలెక్షన్లు రావడం విశేషం.

ఇప్పటివరకు వచ్చిన టోటల్ కలెక్షన్స్
ఖుషి రీ రిలీజ్ 3 రోజుల కలెక్షన్స్ ఏరియాలో వారిగా ఈ విధంగా ఉన్నాయి. నైజం ఏరియాలో ఈ సినిమా 2.48 కోట్లను అందుకోగా సీడెడ్ 70 లక్షలం7 సొంతం చేసుకుంది. ఇక ఏపీ లో అయితే 2.49 కోట్లు వచ్చాయి. దీంతో ఏపీ తెలంగాణలో టోటల్ గా 5.68 కోట్లు వచ్చాయి. కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 58 లక్షల రాగా ఓవర్సీస్ లో 27 లక్షలను అందుకుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 6.53 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

రీ రిలీజ్ లలో రికార్డు
అసలు ఖుషి సినిమా అయితే ఈ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అని ఎవరు ఊహించలేదు. ఈ సినిమా గత రీ రిలీజ్ సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసింది. కొత్త సినిమాలో ఈ రోజులలో పాజిటివ్ టాక్ అందుకున్నా కూడా రెండవ రోజుకి కలెక్షన్స్ తగ్గిపోతున్నాయి. కానీ 20 ఏళ్ల క్రితం వచ్చిన ఖుషి సినిమా మాత్రం మూడు రోజుల్లో 6 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం విశేషం. ఇక ఇంతకుముందు జల్సా పోకిరి రికార్డులను కూడా బ్రేక్ చేసి రీ రిలీజ్ ట్రెండ్ లో అయితే ఖుషి సినిమా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.