»   » రజనీ, చిరులకు పవన్ కల్యాణ్ చెక్.. రికార్డుల జోరు..

రజనీ, చిరులకు పవన్ కల్యాణ్ చెక్.. రికార్డుల జోరు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు ఉన్న స్టామినా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం కాటమరాయుడు. మార్చి చివరి వారంలో విడుదలయ్యేందుకు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. ఆడియో రిలీజ్‌కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ఓ రికార్డును సొంతం చేసుకొన్నది.

 కాటమరాయుడు‌ టీజర్@80 లక్షలు

కాటమరాయుడు‌ టీజర్@80 లక్షలు


విడుదలకు ముందే ఎంతో క్రేజ్‌ను కాటమరాయుడు సంపాదించుకున్నది. ఈ చిత్ర టీజర్ ఓ అరుదైన రికార్డును అధిగమించింది. ఇటీవల రిలీజైన కాటమరాయుడు టీజర్‌ను యూట్యూబ్‌లో దాదాపు 80 లక్షల మంది వీక్షించారు. ఇది టాలీవుడ్‌లో ఓ రికార్డు.


 రెండువారాల క్రితం యూట్యూబ్లో..

రెండువారాల క్రితం యూట్యూబ్లో..


యూట్యూబ్‌లో వెల్లడైన ప్రకారం రెండు వారాల క్రితం కాటమరాయుడు టీజర్‌ను 7,786,472 మంది వీక్షించారు. ఆ సంఖ్య దాదాపు 80 లక్షలకు చేరుకోవచ్చని అంచనా. ఇది దక్షిణాది చిత్ర పరిశ్రమలో రికార్డుగా అభివర్ణిస్తున్నారు.


రజనీ, చిరులకు పవన్ కల్యాణ్ చెక్

రజనీ, చిరులకు పవన్ కల్యాణ్ చెక్


కాటమరాయుడుకు ముందు అగ్రస్థానంలో చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 సినిమా టీజర్ ఉండేది. ఈ టీజర్‌ను దాదాపు 71 (7.1 మిలియన్స్) లక్షల మంది చూశారు. దానికంటే ముందు రజనీకాంత్ నటించిన కబాలి చిత్ర టీజర్‌ను 66 లక్షల మంది అంటే 6.6 మిలియన్ల మంది వీక్షించారు. ప్రస్తుతం ఈ రికార్డులను పవన్ కల్యాణ్ అధిగమించాడు.


 మార్చి 29 కాదు.. 24 తేదీనే కాటమరాయుడు

మార్చి 29 కాదు.. 24 తేదీనే కాటమరాయుడు


కాట‌మ‌రాయుడు చిత్రాన్ని మార్చిలో విడుద‌ల చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. వాస్తవంగా ఈ చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఆ తేదీ కంటే ముందే విడుదల చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని మార్చి 24న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
English summary
Katama Rayudu Teaser create a record in Youtube. This teaser viewed nearly 80 lakhs people. Pawan Kalyan movie teaser surpasses Chiranjeevi Khaidi number 150, Rajinikanth's Kabali records.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu