»   »  బాలీవుడ్‌కు పవన్ షాక్.. రికార్డులు.. సునామీ వేగం

బాలీవుడ్‌కు పవన్ షాక్.. రికార్డులు.. సునామీ వేగం

Posted By:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాదిలో కలెక్షన్లలో రికార్డుల సునామీని సృష్టించిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా యూట్యూబ్‌లోనూ ఎదురులేదని నిరూపించుకొన్నాడు. గత శనివారం విడుదలైన కాటమరాయుడు టీజర్ ఇంటర్నెట్‌లో హల్ చల్ సృష్టిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు హిట్స్ తో దూసుకెళ్తున్నది. ఇటీవల చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 టీజర్ల రికార్డును తుడిపేసింది.

 బాలీవుడ్‌‌కు షాకిచ్చిన పవర్ స్టార్

బాలీవుడ్‌‌కు షాకిచ్చిన పవర్ స్టార్


కాటమరాయుడు లభిస్తున్న హిట్స్ చూసి బాలీవుడ్‌ పరిశ్రమ కూడా నివ్వెరపోతున్నది. పవర్ స్టార్‌కు ఉన్న ఇమేజ్‌ను చూసి హిందీ నటులు ఆశ్చర్యపోతున్నారు. కాటమరాయుడు టీజర్ దూకుడును చూసి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ముక్కున వేలు వేసుకొన్నాడట. అదే విషయంపై స్వయంగా సల్మాన్ స్పందించారట.


 యూట్యూబ్‌లో కాటమరాయుడు ప్రభంజనం ఇలా..

యూట్యూబ్‌లో కాటమరాయుడు ప్రభంజనం ఇలా..


కాటమరాయుడు చిత్రానికి సంబంధించిన టీజర్‌ను శనివారం సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్‌లో ఆవిష్కరించారు. కేవలం 10 నిమిషాల్లోనే 20 వేల హిట్స్ సాధించింది. ఆ తర్వాత అదే దూకుడు కొనసాగించింది. తెలుగు సినీ పరిశ్రమలో 24 గంటల్లో 30 లక్షల హిట్స్ తో ఉన్న రికార్డును అధిగమించింది. మూడు రోజుల వ్యవధిలోనే 50 లక్షల హిట్స్‌ను ఈ టీజర్ సొంతం చేసుకొన్నది.


 విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డుల పరంపర

విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డుల పరంపర


తొలి రెండు గంటల్లోనే - 10 లక్షలు
5.5 గంటల్లో - 20 లక్షలు
24 గంటల్లో - 30 లక్షలు
36 గంటల్లో - 40 లక్షలు
57 గంటల్లో - 50 లక్షలు


 స్క్రీన్ ప్రజెన్స్ స్పెషల్ ఎఫెక్ట్

స్క్రీన్ ప్రజెన్స్ స్పెషల్ ఎఫెక్ట్

ఈ టీజర్ కాటమరాయుడి చిత్రం గురించి పెద్దగా ప్రస్తావన లేదు. కానీ పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకొనేలా ఉంది. పవర్ స్టార్ చెప్పిన పవర్ ఫుల్‌గా చెప్పిన డైలాగ్ అదరగొట్టింది. ఆట, పాట అభిమానుల్లో హుషారెత్తించింది. ఫైట్స్ దుమారం రేపింది. టోటల్‌గా ఈ టీజర్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టింది. తమిళంలో అజిత్.. తెలుగులో పవన్

తమిళంలో అజిత్.. తెలుగులో పవన్

తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన వీరం చిత్రానికి ఇది రీమేక్. వీరంలో తలా అజిత్ కుమార్ నటించగా.. అదే పాత్రను తెలుగులో పవన్ షోషిస్తున్నారు. పవన్ సరసన్ శృతిహాసన్ నటిస్తున్నది. పవన్ తో శృతి నటించడం ఇది రెండోసారి. ఇంకా ఈ చిత్రంలో కాటమరాయుడి సోదరులుగా శివ బాలాజీ, అజయ్, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ నటిస్తున్నారు. ఉగాదికి రాయుడు ముస్తాబు

ఉగాదికి రాయుడు ముస్తాబు


కాటమరాయుడు ఫిబ్రవరి నెల చివరికల్లా షూటింగ్ పూర్తి చేసుకోనున్నది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఉగాదికి విడులయ్యేందుకు ముస్తాబవుతున్నది. ఈ మధ్యలోనే అంగరంగ వైభవంగా ఆడియోను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రానికి కిషోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తుండగా, శరత్ మరార్ నిర్మాత వ్యవహరిస్తున్నారు.
English summary
Powerstar Pawan Kalyan's Katamaryudu teaser is now the fastest Telugu film to cross three million views in less than 24 hours. In 57 hours count crossed 50 Lakhs. Remake of Tamil blockbuster Veeram is getting ready for Ugadi.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu