twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రాంబాబు' ఫైనల్ రిజల్ట్(ట్రేడ్ టాక్)

    By Srikanya
    |

    హైదరాబాద్ : పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు'. రిలీజైన రోజు డివైడ్ టాక్ తెచ్చుకున్నా రెండో రోజుకి వావాదం వెనకేసుకోవటంతో డిస్ట్రిబ్యూటర్స్ లో కొత్త ఆశలు చిగురించాయి. దాంతో ఆంధ్ర ప్రాంతంలో కలెక్షన్లకు లోటు లేకుండా పోయింది. దానికి తోడు పోటీగా మరుసటి రోజే దసరా కానుకగా వస్తుందనుకున్న నాగార్జున డమరుకం కాస్తా తెలియని తేదీకి వాయిదా అయపోవడం రాంబాబుకు కలిసి వచ్చిన అంశం. వారం రోజులు కలెక్షన్లు బాగానే అందుకుంది.

    ఇక తెలంగాణా ప్రాంతంలో వివాదం సద్దుమణిగాక కలెక్షన్లు పెద్దగా పుంజుకోలేదు కానీ, కొంచెం నయమే అంటున్నారు. మరో ప్రక్క మంచు విష్ణు దేనికైనా రెడీ ఈ వారం విడదల అయ్యింది. కథ, కథనాలు పెద్దగా కొత్తవి కాకపోయనా , సినిమా కామెడీగా సాగడంతో, కలెక్షన్లు బాగానే వుండే అవకాశం వుందని ట్రేడ్ లో అంచనాలు వేస్తున్నారు. ఈ ప్రభావం రాంబాబుపై పడినా ఆశ్చర్యపోనక్కరలేదని చెప్తున్నారు.

    ఇక వచ్చేవారం పెద్ద సినిమా విడుదల ఏదీ లేకపోవడంతో, రాంబాబు, దేనికైనా రెడీలకు పెద్దగా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేదని అంటున్నారు. అయితే ఈ లోగా నాగార్జున ఢమురకం తన సమస్యలను అధిగమించి ముందుకు వస్తేనే ఈ సినిమాకు సమస్యగా మారుతుంది. ప్రేక్షకులకు మరో ఆప్షన్ దొరుకుతుంది. నాగార్జున కు ఢమురకం చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అనూష్క హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని శ్రీనివాస రెడ్డి డైరక్ట్ చేసారు. పూర్తి గ్రాఫిక్స్ తో ఈ చిత్రం ఈగ రేంజిని దాటుతుందని చెప్తున్నారు.

    'డమరుకం' సిజి వల్లే ఆలస్యం అయ్యింది. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలోని 'డమరుకం' చిత్రీకరణ పూర్తయింది. అయితే కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ వల్ల రిలీజ్‌ ఆలస్యమైంది. నిర్మాత ఆర్‌.ఆర్‌.వెంకట్‌ రాజీ లేకుండా ఖర్చు చేస్తున్నారీ సినిమాకి. సోసియోఫాంటసీ కథలో మాస్‌ మసాలాను అద్భుతంగా మిక్స్‌ చేసి దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. నా 25ఏళ్ల కెరీర్‌లో ఎవరూ చేయని కొత్త తరహా చిత్రమిది. 2012నాటికి ప్రపంచం ఉండదు..అనే కాన్పెప్టుతో హాలీవుడ్‌ సినిమాలెన్నో వచ్చాయి. ఆ తరహా చిత్రమిది. గ్రహాల తీరుపెై స్పృషించారు. బొట్టు శీను తరహా మాస్‌ పాత్ర మరో హైలెైట్ అని చెప్పారు.

    English summary
    Pawan Kalyan starrer Telugu political satire 'Cameraman Ganga Tho Rambabu' garnered a whopping Rs 52 crore at the box office, which includes overseas collection, in its opening weekend, despite Telangana activists disrupting screenings in some parts of Andhra Pradesh. The film released worldwide Oct 18 in more than 1,500 screens.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X