»   » అదిరిపోయే రేటుకు 'పెళ్ళిచూపులు' శాటిలైట్ రైట్స్, డిటేల్స్

అదిరిపోయే రేటుకు 'పెళ్ళిచూపులు' శాటిలైట్ రైట్స్, డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'సైన్మా' అనే షార్ట్ ఫిల్మ్‌తో చక్కని పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్... ఇప్పుడు 'పెళ్ళిచూపులు' అనే ఫీచర్ ఫిల్మ్‌తో హాట్ టాపిక్ గా మారారు. తొలికాపీ రాగానే ఈ సినిమా చూసిన ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు ఈ సినిమాకు సమర్పకులుగా మారిపోయి చక్కటి ప్లానింగ్ తో విడుదల చేసి సినిమాకు ఎక్కడ లేని క్రేజ్ క్రియేట్ చేసారు. ఈ నేపద్యంలో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కు ఓ రేంజిలో డిమాండ్ ఏర్పడింది.

ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం మొదట్నుంచీ భారీ పోటీ ఏర్పడింది. రీసెంట్ గా తెలుగు ప్రముఖ చానళ్ళలలో ఒకటైన జెమినీ టీవీ ఈ హక్కులను సొంతం చేసుకుంది. అందుతున్న సమాచారం ప్రకారం..సుమారు 2.35 కోట్ల రూపాయలు వెచ్చించి జెమినీ టీవీ, పెళ్ళిచూపులు సాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Pelli Choopulu’s satellite rights sold for a bomb

రెండు వారాల క్రితం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులూ, సినీ ప్రముఖుల దగ్గర్నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సినిమా గురించి ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ ఉండటం ప్లస్ అయ్యింది. ఈ సినిమా కు రాజమౌళి ఇచ్చి రివ్యూ బాగా కలిసి వచ్చింది.

'పెళ్ళిచూపులు' సినిమా చాలా బాగుందని, సినిమా అయిపోయాక కూడా సన్నివేశాలన్నీ చుట్టూ తిరుగుతున్నట్టే ఉన్నాయని మొదలుపెడుతూ రాజమౌళి సినిమాపై ప్రశంసలు కురిపించారు. రైటింగ్ పరంగా, డైరెక్షన్ పరంగా, యాక్టింగ్ పరంగా.. ఇలా ఇన్ని విషయాల్లో బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చిన ఈ సినిమా తనకు ఓ మంచి అనుభూతినిచ్చిందని తెలిపారు.

అంతేకాకుండా ఇలాంటి సినిమాలకు ఇంకా ఎక్కువ థియేటర్లు దొరకాలని రాజమౌళి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్ళిచూపులు సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు.

English summary
The satellite rights of Pelli Choopulu have been acquired by popular entertainment channel Gemini TV for a whopping 2.35 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu