»   » పెళ్లి చూపులు: మెగా ఫ్యామిలీ సినిమాను సైతం బతకనివ్వడం లేదుగా...!

పెళ్లి చూపులు: మెగా ఫ్యామిలీ సినిమాను సైతం బతకనివ్వడం లేదుగా...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ మధ్య విడుదలైన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏది అని ఏ తెలుగు ప్రేక్షకుడిని అడిగినా తొలుత వారి నోటి నుండి వస్తున్న మాట 'పెళ్లి చూపులు'. కేవలం రూ. కోటి బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్టెన్ చేస్తూ దూసుకెలుతోంది.

ఇక బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పెట్టుబడితో పోలిస్తే ఈ సినిమాకు వచ్చిన లాభాల శాతం కూడా భారీగా ఉంది. మరో వైపు 'పెళ్లి చూపులు' సినిమాను తట్టుకుని బాక్సాఫీసు వద్ద నిలవడం ఆ తర్వాత వారం విడుదలైన సినిమాలకు కూడాకష్టం అవుతోంది.


పెళ్లి చూపులు సినిమాతో పాటు రిలీజైన జక్కన్న సినిమా ఇప్పటికే బాక్సాఫీసు వద్ద బాగావీక్ అవ్వగా...ఆ తర్వాతి వారం వచ్చిన మోహన్ లాల్ 'మనమంతా', మెగా ఫ్యామిలీ హీరో శిరీస్ నటించిన 'శ్రీరస్తు శుభమస్తు' లాంటి సినిమాలకు కూడా ఆ సినిమాను తట్టుకోవడం కష్టంగా మారింది.


ఇక యూఎస్ఏ తెలుగు సినిమాల మార్కెట్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 'పెళ్లి చూపులు' ఎఫెక్ట్.... మనమంతా, శ్రీరస్తు శుభమస్తు సినిమాలకు జీవన్మరణ సమస్యగా మారింది. యూఎస్ఏ మార్కెట్ల ఈ మూడు సినిమాల వసూళ్లు ఎలా ఉన్నాయనే విశేషాలు స్లైడ్ షోలో...


పెళ్లి చూపులు

పెళ్లి చూపులు

సినిమాలో మంచి కంటెంట్, ఎంటర్టెన్మెంట్ ఉంటే భారీ బడ్జెట్లు పెట్టక పోయినా అద్భుతమైన ఫలితాలు సాధించ వచ్చు అని నిరూపిస్తోంది పెళ్లి చూపులు మూవీ. యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం సెకండ్ వీకెండ్ $300,000 వసూళ్లు సాధించింది. ఓవరాల్ గా ఇప్పటి వరకు $730,000 వసూళ్లు సాధించిన ఈచిత్రం 1 మిలియన్ డాలర్ మార్కును అందుకునే దిశగా దూసుకెలుతోంది.


అంచనాలకు అందలేదు

అంచనాలకు అందలేదు

పెళ్లి చూపులు సినిమా ఇంత పెద్ద హిట్టవుతుందని ఎవరూ ఊహించలేదు. తొలుత పరిమిత సంఖ్యలో థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో థియేటర్ల సంఖ్యను భారీగా పెంచేసారు.


శ్రీరస్తు శుభమస్తు

శ్రీరస్తు శుభమస్తు

పెళ్లి చూపులు మూవీ రిలీజైన వారం తర్వాత అల్లు శిరీష్ నటించిన శ్రీరస్తు శుభమస్తు రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం పెళ్లి చూపులను దాటలేక పోతోంది. ఇండియాలో ఈ చిత్రం టాప్ 2లో ఉండగా, యూఎస్ఏలో మరీ దారుణంగా మూడో స్థానంలో ఉంది. యూఎస్ఏలో ఫస్ట్ వీకెండ్ $39,385 మాత్రమే వసూలు చేసిందంటే అక్కడ ఈ సినిమా పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.


మనమంతా

మనమంతా

మలయాళ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో.. చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో వచ్చిన మనమంతా చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయి. రాజమౌళి కూడా ఈ సినిమాను ప్రమోట్ చేసాడు. అయితే సినిమాలో తెలుగు స్టార్స్ లేక పోవడంతో పెద్దగా ఆడటం లేదు. ఇండియాలో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద 3వ స్థానంలో ఉండగా...యూఎస్ఏలో మాత్రం $115,734 వసూళ్లతో రెండో స్థానంలో ఉంది.


జక్కన్న

జక్కన్న

యూఎస్ఏలో సునీల్ జక్కన కలెక్షన్స్ దారుణంగా ఉండటంతో తొలివారమే బాక్సాఫీసు బరి నుండి తప్పుకుంది. ఇండియాలో జక్కన్న సినిమా పెద్దగా కలెక్షన్లు లేక పోయినా సినిమా చిన్న బడ్జెటే కాబట్టి బీ, సీ సెంటర్లలో కలెక్షన్లు స్టడీగా ఉండటంతో నష్టాలు లేకుండా నిర్మాత బయట పడే అవకాశం ఉందని అంటున్నారు.


English summary
At USA box-office both 'Manamantha' and 'Srirastu Subhamastu' both the movies under performed. The reason for both these movies under performing is the great run that “Pellichoopulu” is having at USA box-office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu