For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  PelliSandaD 1st Week collections: వారంలోనే అన్ని కోట్లు.. హిట్‌కు కొన్ని లక్షల దూరంలోనే పెళ్లిసందD

  |

  మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగు పరిశ్రమలోనూ స్టార్ల వారసులు హీరోలుగా పరిచయం అవుతున్నారు. ఇలా ఇప్పటికే చాలా మంది కుర్రాళ్లు తెరంగేట్రం చేశారు. అయితే, వారిలో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే గ్రాండ్ ఎంట్రీని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించగలిగారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యామిలీ హీరోగా పేరొందిన శ్రీకాంత్.. తన కొడుకు రోషన్‌ను కూడా ఇప్పటికే టాలీవుడ్‌కు పరిచయం చేశాడు. ఇక, అతడు హీరోగా నటించిన చిత్రమే 'పెళ్లిసందD'. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్లు ఊహించని విధంగా వస్తున్నాయి. మరి ఈ సినిమా ఏడు రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  ‘పెళ్లిసందD' అంటూ వచ్చిన రోషన్

  ‘పెళ్లిసందD' అంటూ వచ్చిన రోషన్

  యంగ్ బాయ్ రోషన్, శ్రీలీలా జంటగా నటించిన చిత్రం 'పెళ్లిసందD'. ఈ మూవీని గౌరీ రోణంకి తెరకెక్కించారు. ఈ చిత్రంలో రాఘవేంద్రరావు కీలక పాత్రలో నటించారు. దీన్ని ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్లపై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి ఎమ్ఎమ్ కీరవాణి దీనికి సంగీతం అందించారు.

  అరాచకమైన ఫొటోను వదిలిన పూజా హెగ్డే: ఒక పక్క విప్పేసి మరీ.. ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

  అంచనాలు భారీగా... బిజినెస్ ఎంత?

  అంచనాలు భారీగా... బిజినెస్ ఎంత?

  రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా నటించిన 'పెళ్లి సందడి' సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడిదే టైటిల్‌లో వచ్చిన 'పెళ్లిసందD' మూవీపై అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్‌తో అవి మరింతగా ఎక్కువయ్యాయి. అందుకే ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 7.70 కోట్ల మేర ప్రీ బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

  నెగెటివ్ టాక్.. కానీ రెస్పాన్స్ మాత్రం

  నెగెటివ్ టాక్.. కానీ రెస్పాన్స్ మాత్రం

  దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పెళ్లిసందD' మూవీకి ప్రేక్షకుల నుంచి నెగెటివ్ టాక్ వచ్చింది. దీనికి తోడు రివ్యూలు కూడా దారుణంగా వచ్చాయి. దీంతో ఈ సినిమా నెగ్గుకు రావడం కష్టమేనన్న టాక్ కూడా వినిపించింది. కానీ, ఆ వెంటనే ఈ చిత్రం బాగా పుంజుకుంది. ఇలా వీకెండ్‌లో భారీగా.. ఆ తర్వాత మోస్తరుగా రెస్పాన్స్‌తో పాటు కలెక్షన్లను సంపాదిస్తోంది.

  మితిమీరిన జాన్వీ కపూర్ హాట్ షో: ఘాటు ఫోజులో అందాలను మొత్తం చూపిస్తోన్న శ్రీదేవి కూతురు

  ఏడో రోజు ఎక్కడ... ఎంత వచ్చింది?

  ఏడో రోజు ఎక్కడ... ఎంత వచ్చింది?

  'పెళ్లిసందD' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు కలెక్షన్లు తగ్గాయి. ఫలితంగా దీనికి నైజాంలో రూ. 6 లక్షలు, సీడెడ్‌లో రూ. 6 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 1.40 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 1.80 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. ఏడో రోజు రూ. 24 లక్షలు షేర్, రూ. 38 లక్షలు గ్రాస్ మాత్రమే కలెక్ట్ అయింది.

  ఏడు రోజులకూ కలిపి ఎంతొచ్చాయి?

  ఏడు రోజులకూ కలిపి ఎంతొచ్చాయి?

  నెగెటివ్ టాక్‌తోనూ మంచి ఓపెనింగ్స్ దక్కించుకున్న 'పెళ్లిసందD' మూవీ.. వారం రోజుల్లో నైజాంలో రూ. 1.65 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.19 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 74 లక్షలు, ఈస్ట్‌లో రూ. 37 లక్షలు, వెస్ట్‌లో రూ. 31 లక్షలు, గుంటూరులో రూ. 50 లక్షలు, కృష్ణాలో రూ. 34 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో.. రూ. 5.36 కోట్లు షేర్, రూ. 8.80 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

  Bigg Boss: బిగ్ బాస్ సీక్రెట్స్ తెలుసుకున్న రవి.. టాప్‌ 5లో ఉండే కంటెస్టెంట్లు ఎవరో చెప్పేశాడుగా!

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు?

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు?

  తెలుగు రాష్ట్రాల్లో వారం రోజుల్లో రూ. 5.36 కోట్లు షేర్ రాబట్టిన 'పెళ్లిసందD' మూవీ.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 22 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 7 లక్షలు మేర వసూలు చేసింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఏడు రోజుల్లో రూ. 5.65 కోట్లు షేర్, రూ. 9.40 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా నెగెటివ్ టాక్‌తోనూ మంచి కలెక్షన్లను అందుకుని విజయం దిశగా సాగుతోంది.

  Pelli SandaD Movie Success Celebrations
  బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు ఎంత రావాలి?

  బ్రేక్ ఈవెన్ టార్గెట్‌కు ఎంత రావాలి?

  చిన్న హీరోనే అయినా 'పెళ్లిసందD' మూవీ విశేషంగా ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరుపుకుంది. దీంతో అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 7.70 కోట్లు మేర వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెంట్ టార్గెట్ రూ. 7 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా వారం రోజుల్లో రూ. 5.65 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 35 లక్షలు వసూలు చేస్తేనే హిట్ స్టేటస్‌ను అందుకుంటుంది.

  English summary
  Roshann, Sree Leela and K. Raghavendra Rao Did PelliSandaD Movie Under Gowri Ronanki Direction. This Movie Collect Rs 5.65 Crore in Seven Days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X