»   » డేటిచ్చారు : తెలుగులోనూ పెద్ద హిట్టవుతుంది

డేటిచ్చారు : తెలుగులోనూ పెద్ద హిట్టవుతుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :నాగ, ప్రయాగ మార్టిన్‌, రాధారవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం'పిశాచి'. తమిళ చిత్రం 'పిశాసు'కు అనువాద రూపమిది. మిస్కిన్‌ దర్శకత్వం వహించారు. సి.కల్యాణ్‌, కోనేరు కల్పన, సి.వి.రావు నిర్మాతలు. ఈ నెల 27న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


‘చంద్రకళ' సినిమా తరువాత మరో తమిళ సూపర్‌హిట్‌ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు సి.కళ్యాణ్‌. మిస్కిన్‌ దర్శకత్వంలో తమిళ దర్శకుడు బాల నిర్మించిన ‘పిశాచి' సినిమాను సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. పతాకంపై సి.కల్యాన్‌, కల్పన అదే టైటిల్‌తో తెలుగులోకి అనువదిస్తున్నారు. బాల ఈ చిత్రానికి సమర్పకులు.


సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ''మంచి పనులు చేసే ఒక దెయ్యం కథ ఇది. ఒక ఇంట్లోకి ప్రవేశించిన దెయ్యం ఏమేం పనులు చేసిందన్నది తెరపైనే చూడాలి. సన్నివేశాలు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతాయి. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులనూ అలరిస్తుందనే నమ్మకం మాకుంది. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలకు చక్కటి స్పందన లభించింది''అన్నారు.


Pisachi movie release on feb 27th

ఇక ‘‘మిస్కిన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్కడ పెద్ద హిట్‌ అయింది. మనసుల్ని దోచుకునే ఓ దెయ్యం కథ ఇది. ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలా అంతా కొత్తవారితో ఈ సినిమా నిర్మించారు. రొమాంటిక్‌ హారర్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుదన్న నమ్మకం ఉంది. పెద్ద పోటీ మధ్య ఈ సినిమా రైట్స్‌ దక్కించుకున్నాను ' అని తెలిపారు.


అలాగే... ''మనసుల్ని దోచుకొనే దెయ్యం కథతో రూపొందిన చిత్రమిది. తమిళంలో ప్రముఖ దర్శకుడు బాల నిర్మించారు. అక్కడ ఘన విజయం సాధించింది. తెలుగు ప్రేక్షకుల్ని కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి'' అన్నారు.


ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ ని 25 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ బిజినెస్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. హరీష్‌ ఉత్తమన్‌, అశ్వథ్‌, కల్యాణి నటరాజన్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: అరోల్‌ కొరేళి, ఛాయాగ్రహణం: రవిరాయ్‌, మాటలు: శశాంక్‌.

English summary
Tamil Movie ‘Pisaasu’ is dubbed in to Telugu as ‘Pisachi’. Naga,Prayaga Martin are in the main lead. The movie has completed all its dubbing formalities and get a release date.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu