For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ponniyin Selvan Collections: చరిత్ర సృష్టించిన PS1.. సినీ చరిత్రలోనే టాప్ మూవీగా రికార్డు

  |

  ఈ మధ్య కాలంలో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా భారీ బడ్జెట్ చిత్రాలు తెరకెక్కుతోన్నాయి. అక్కడి మూవీలకు దేశ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోండడంతో దర్శక నిర్మాతలు, హీరోలు ధైర్యంగా ముందుకు వచ్చి పాన్ ఇండియా మూవీలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు సినిమాలు వచ్చి ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన సినిమానే 'పొన్నియన్ సెల్వన్'. భారీ స్టార్ కాస్ట్‌తో రూపొందిన ఈ మూవీ ఎన్నో అంచనాలతో విడుదలైంది. అందుకు తగ్గట్లుగానే కలెక్షన్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ మొదటి రోజు వసూళ్లపై ఓ లుక్కేద్దాం పదండి!

  పొన్నియన్ సెల్వన్‌లో ఎవరెవరు?

  పొన్నియన్ సెల్వన్‌లో ఎవరెవరు?

  లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పిరియాడిక్ యాక్షన్ మూవీనే 'పొన్నియన్ సెల్వన్'. ఇందులో విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు నటించారు. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు.

  శృతి మించిన ప్రియ ప్రకాశ్ హాట్ షో: తడిచిన దేహంతో మెంటలెక్కించేలా!

  బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

  బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

  క్రేజీ కాంబోలో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి తమిళంలో దాదాపు రూ. 65 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ భారీ చిత్రానికి రూ. 130 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు తెలిసింది.

  అలాంటి టాక్‌తో భారీ రెస్పాన్స్

  అలాంటి టాక్‌తో భారీ రెస్పాన్స్

  ఎన్నో అంచనాల నడుమ విడుదలైన పిరియాడిక్ యాక్షన్ మూవీ 'పొన్నియన్ సెల్వన్' శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ వచ్చింది. తెలుగులో కూడా అలాంటి టాకే దక్కింది. దీంతో ఈ సినిమా కూడా అనుకున్నట్లుగా కలెక్షన్లను రాబట్టలేదని అంతా అనుకున్నారు. కానీ రెస్పాన్స్ మాత్రం భారీగా వచ్చింది.

  Bigg Boss Elimination: చివరి రోజు మారిన ఓటింగ్.. డేంజర్ జోన్‌లోకి మోడల్.. ఆ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్

  తమిళనాడులో మూడో మూవీగా

  తమిళనాడులో మూడో మూవీగా

  ఎంతో మంది స్టార్లు కలిసి నటించిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి తమిళనాడులో భారీ స్పందన దక్కింది. దీంతో ఈ సినిమా మొదటి రోజు అక్కడ రూ. 25.86 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. తద్వారా ఈ ఏడాది అత్యధిక గ్రాస్ అందుకున్న చిత్రాల్లో ఇది మూడో స్థానానికి చేరుకుంది. దీనికంటే ముందు రూ. 36.17 కోట్లతో 'వలిమై', రూ. 26.50 కోట్లతో 'బీస్ట్' ఉన్నాయి.

  ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు

  ప్రపంచ వ్యాప్తంగా అన్ని కోట్లు

  భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు మంచి స్పందనే వచ్చింది. దీంతో ఈ చిత్రం అన్ని ఏరియాలనూ కలుపుకుని దాదాపు రూ. 72 - 75 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఫస్ట్ డే యాభై కోట్ల మార్కును చేరుతుందనుకున్న అంచనాలు నిజమయ్యాయి.

  హీరోయిన్ శ్రీయ ఎద అందాల జాతర: వామ్మో అలా పడుకుని మరీ!

  ఓవర్సీస్‌లో సంచలన రికార్డు

  ఓవర్సీస్‌లో సంచలన రికార్డు

  మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్' మూవీకి ఓవర్సీస్‌లో భారీ రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా అన్ని వెర్షన్‌లను కలుపుకుని ప్రీమియర్స్ ద్వారానే ఈ చిత్రం 1 మిలియన్ మార్కును చేరుకుంది. అలాగే, మొదటి రోజు మరో మిలియన్ డాలర్లను అందుకుంది. ఇలా ఫస్ట్ డేకే రెండు మిలియన్లను రాబట్టిన ఏకైక తమిళ చిత్రంగా ఇది సంలచనం సృష్టించింది.

  తెలుగులోనూ మంచి వసూళ్లు

  తెలుగులోనూ మంచి వసూళ్లు

  తమిళ చిత్రాలకు తెలుగులో కూడా మంచి స్పందన వస్తూ ఉంటుంది. అందుకే 'పొన్నియన్ సెల్వన్' చిత్రం మన దగ్గర భారీ బిజినెస్ జరుపుకుని గ్రాండ్‌గా విడుదలైంది. దీనికి తెలుగు రాష్ట్రాల్లో కూడా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, ప్రేక్షకుల నుంచి స్పందన మంచిగానే రావడంతో వసూళ్లు దాదాపు రూ. 5 కోట్ల వరకూ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.

  English summary
  Kollywood Star Director Mani Ratnam Did Ponniyin Selvan Movie With Huge Star Cast. Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X