»   » నిజమా...‘పోటుగాడు’కలెక్షన్స్ అంతా ?

నిజమా...‘పోటుగాడు’కలెక్షన్స్ అంతా ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మంచు మనోజ్ హీరోగా క్రితం వారం విడుదలైన చిత్రం 'పోటుగాడు'. మీడియానుంచి నెగిటివ్ రివ్యూలు ఎదుర్కొన్న ఈ చిత్రం ఘన విజయం సాధించిందని రెండో వారం పోస్టర్స్ వేస్తున్నారు. అలాగే నిర్మాత లగడపాటి శ్రీధర్... పెద్ద హిట్ అని వివరిస్తున్నారు. అలాగే మనోజ్ వంద రోజుల్లో చిత్రం సాధించే రెవిన్యూని ఈ చిత్రం మొదటి రెండు రోజుల్లోనే సాధించిందని చెప్తున్నారు. తమ బ్యానర్ లో వచ్చిన ఎవడి గోల వారిదే చిత్రం 175 కి సాధించిన మొత్తం కూడా రెండు రోజుల్లోనే క్రాస్ చేసిందని చెప్పుతూ పబ్లిసిటీ క్యాంపైన్ చేస్తున్నారు.

రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై పవన్ వడయార్ దర్శకత్వంలో లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన 'పోటుగాడు' చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. మంచు మనోజ్, సాక్షీ చౌదరి, సిమ్రాన్‌కౌర్ ముండి, రేచెల్ వేస్, అనుప్రియ ప్రధాన తారాగణంగా నటించారు.

నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ- కథని, నటీనటులని నమ్మి తానీ చిత్రం నిర్మించానని, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లు చక్కని పథకంతో విడుదల చేశారని, దీంతో సినిమా హిట్టయి తమ సంస్థకు మంచి పేరు తెచ్చిందని, అదేవిధంగా తమ అందరి నమ్మకాలు కూడా నిజమైనందుకు ఆనందంగా ఉందని, ఓ రకంగా పోటుగాడు అన్ని కేంద్రాలలో అదరగొడుతున్నాడని తెలిపారు.

'ఎవరిగోల వాడిది' చిత్రం విడుదలయ్యాక మళ్లీ అటువంటి చిత్రం ఎప్పుడు నిర్మిస్తారా అని అనేకమంది అడిగేవారని, ఈ చిత్ర దర్శకుడు పవన్ వడయార్ కలిశాక ఈ ప్రాజెక్టు ప్రారంభించామని, 'ఎవడిగోల వాడిదే' చిత్ర విజయంకన్నా ఈ చిత్రం మరింత హిట్ టాక్ తెచ్చుకుందని, ఎంటర్‌టైన్‌మెంట్ విషయంలో పోటుగాడు ఏ మాత్రం తగ్గలేదని నిర్మాత శిరీషా లగడపాటి తెలిపారు.

సినిమా ఫ్యాషన్‌తో మంచి సినిమాలు నిర్మించే శ్రీధర్ వినోదాత్మకంగా ప్రేక్షకులను అలరించడానికి పోటుగాడుని తెచ్చి హిట్ కొట్టారని, ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మంచి టాక్‌తో కలెక్షన్లు రాబడుతున్న ఈ చిత్రం మనోజ్ కెరీర్‌కు ప్లస్ అయిందని నటుడు కాశీ విశ్వనాధ్ తెలిపారు.

రాజకీయాలతో ఏ పార్టీతోనో సంబంధం లేకుండా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌తోనే నిర్మాత ఈ చిత్రాన్ని తీసి విజయవంతం చేశారని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ చిత్రంలో తానో మంచి పాత్ర చేసినందుకు సంతోషంగా ఉందని పోసాని కృష్ణమురళి తెలిపారు. సినిమా హిట్ చేసిన తెలుగు పేక్షకులకు కృతజ్ఞతలని హీరోయిన్ సాక్షీ చౌదరి తెలిపారు.

English summary
Potugadu is Manchu Manoj's biggest hit so far says producer Lagadapati Sridhar. The film is foraying into second week after release. Lagadapati Sridhar informed that the film has already collected the amount that normally happens for a Manoj film during the 100 days after the film release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu