For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘మిర్చి’ కేక...(‘మిర్చి’ వీకెండ్=‘నాయక్’ లైఫ్ టైమ్!)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'మిర్చి' చిత్రం ఓవర్సీస్‌లో కలెక్షన్స్ విషయంలో అదరగొడుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈచిత్రం గడిచిన వీకెండ్ యుఎస్ బాక్సాఫీసు చార్టులో టాప్ పొజిషన్ దక్కించుకోవడంతో పాటు హిందీ సినిమాలు 'స్సెషల్ 26', 'ABCD-ఎనీ బడీ కెన్ డాన్స్' చిత్రాలను 2, 3 స్థానాలకు నెట్టేసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే 'మిర్చి' చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ 'నాయక్' చిత్రం యూఎస్‌లో వసూలు చేసిన టోటల్ లైఫ్ టైమ్ కలెక్షన్స్‌‌కు చేరువగా ఉండటం.

  అమెరికాలో ఫిబ్రవరి 7న విడుదలైన 'మిర్చి' చిత్రం 82 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతూ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అమెరికాలో తొలి వీకెండ్ గడిచే నాటికే ఈ చిత్రం రూ. 2.54 కోట్లు($4,71,941) వసూలు చేసింది. సంక్రాంతికి విడులైన రామ్ చరణ్ 'నాయక్' చిత్రం అమెరికాలో టోటల్‌గా ఇప్పటి వరకు కేవలం రూ. 2.66 కోట్లు($4,94,140) మాత్రమే వసూలు చేసింది.

  ఇక అక్షయ్ కుమార్-కాజల్ జంటగా నటించిన 'స్పెషల్ 26' చిత్రం 85 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతూ రూ.2.49 కోట్లు($4,62,262), ప్రభుదేవా ABCD 25 స్ర్కీన్లలో ప్రదర్శితం అవుతూ రూ. 51.29 లక్షలు(($95,236) వసూలు చేసింది. మిర్చి విడుదల కారణంగా అప్పటికే విడుదలైన పలు తెలుగు సినిమాల బిజినెస్ బాగా డౌన్ అయింది.

  మూడు వారాలు పూర్తి చేసుకున్న 'విశ్వరూపం' తెలుగు వెర్షన్ ఈ వీకెండ్ 15 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతూ $16,047 వసూలు చేసింది. టోటల్ గా ఇప్పటి వరకు విశ్వరూపం రూ. 1.03 కోట్లు ($1,90,441) రాబట్టింది. సెకండ్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఒంగోలు గిత్త చిత్రం 5 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతూ ఈ వీకెండ్ $608 వసూలు చేసింది. టోటల్‌గా రూ. 14.97 లక్షలు($27,800) రాబట్టింది.

  ఇక 5వ వారాంతం పూర్తి చేసుకున్న SVSC ఈ వీకెండ్ $520 వసూలు చేసింది. టోటల్ గా రూ. 8.81 కోట్లు($16,35,300) కలెక్ట్ చేసింది. రామ్ చరణ్ తేజ్ 'నాయక్' ఈ వీకెండ్ $168 వసూలు చేసి టోటల్ గా యూఎస్ లో ఇప్పటి వరకు రూ. 2.66 కోట్లు($4,94,140) రాబట్టింది.

  ఇక 'మిర్చి' యూకె కలెక్షన్స్ విషయానికొస్తే..
  యుకెలోనూ మిర్చి చిత్రం బిజినెస్ డీసెంట్ గా సాగుతోంది. ఈ వీకెండ్ ఈచిత్రం రూ.3.03 లక్షలు(£3,591) వసూలు చేసింది. వీటితో కలుపుకుని మిర్చి టోటల్ ఓవర్సీస్ కలెక్షన్స్ తొలి వారాంతం ముగిసే నాటికి రూ. 2.57 కోట్లకు చేరుకుంది.

  English summary
  Telugu movie Mirchi starring Prabhas, Anushka Shetty and Richa Gangopadhyay in leads, has received an earth-shattering opening at the international Box Office. The Koratala Siva directed film has topped USA collection chart, pushing down big Hindi releases like Special 26 and ABCD - Any Body Can Dance second and third places. Its first weekend collection is very close to the lifetime business of super-hit flick Nayak.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X