twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Radhe Shyam 9 Days Collections: ప్రభాస్‌కు ఘోర పరాభవం.. శనివారం షాకింగ్‌గా.. చెత్త రికార్డు దిశగా!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న బడా హీరోల్లో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. కృష్ణంరాజు ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్లను నిరూపించుకుని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. ఆ తర్వాత పంథాను మార్చుకున్న ప్రభాస్.. తన మార్కెట్‌కు అనుగుణంగా భారీ చిత్రాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవలే 'రాధే శ్యామ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు కలెక్షన్లు అంతగా రావట్లేదు. మరి అసలు 'రాధే శ్యామ్' మూవీ 9 రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దామా!

     ‘రాధే శ్యామ్'గా వచ్చిన రెబెల్ స్టార్

    ‘రాధే శ్యామ్'గా వచ్చిన రెబెల్ స్టార్

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన రొమాంటిక్ మూవీనే 'రాధే శ్యామ్'. ఈ సినిమాను కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేశారు. ఇందులో రెబెల్ స్టార్ ప్రభాస్ పాలమిస్ట్ పాత్రలో నటించాడు.

    శృతి మించిన జాన్వీ కపూర్ హాట్ ట్రీట్: ఎద అందాలు పూర్తిగా కనిపించేంత ఘోరంగా!శృతి మించిన జాన్వీ కపూర్ హాట్ ట్రీట్: ఎద అందాలు పూర్తిగా కనిపించేంత ఘోరంగా!

    ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్

    ప్రీ రిలీజ్ బిజినెస్‌తో ప్రభాస్ రికార్డ్


    రెబెల్ స్టార్ ప్రభాస్‌కు ఏపీ, తెలంగాణతో పాటు చాలా ప్రాంతాల్లో భారీ మార్కెట్ ఉంది. దీంతో 'రాధే శ్యామ్' మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి రూ. 105.20 కోట్లు, కర్నాటకలో రూ. 12.50 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 2.10 కోట్లు, హిందీలో రూ. 50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 27 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు బిజినెస్ జరిగింది.

     9వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    9వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?


    ఏపీ, తెలంగాణలో 9వ రోజూ 'రాధే శ్యామ్' మూవీకి కలెక్షన్లు తగ్గాయి. దీంతో నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 4 లక్షలు, ఈస్ట్‌లో రూ. 3 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 3 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో.. 9వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 34 లక్షలు షేర్‌తో పాటు రూ. 50 లక్షలు గ్రాస్ వచ్చింది.

    Bigg Boss Non Stop: షోలో అసభ్యకరమైన సీన్.. పూల్‌లో వాళ్లిద్దరి సరసాలు.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారిBigg Boss Non Stop: షోలో అసభ్యకరమైన సీన్.. పూల్‌లో వాళ్లిద్దరి సరసాలు.. బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి

    9 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు

    9 రోజులకు తెలుగు రాష్ట్రాల రిపోర్టు


    'రాధే శ్యామ్'కు 9 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో నిరాశే ఎదురైంది. ఫలితంగా నైజాంలో రూ. 24.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.35 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.77 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.26 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.28 కోట్లు, గుంటూరులో రూ. 4.43 కోట్లు, కృష్ణాలో రూ. 2.63 కోట్లు, నెల్లూరులో రూ. 2.11 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 53.33 కోట్లు షేర్, రూ. 83.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

    తొమ్మిది రోజుల్లో ఏపీ, తెలంగాణలో 'రాధే శ్యామ్'కు రూ. 53.33 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 4.20 కోట్లు, తమిళనాడులో రూ. 77 లక్షలు, కేరళలో రూ. 18 లక్షలు, హిందీలో రూ. 9.80 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.63 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.27 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 81.18 కోట్లు షేర్‌తో పాటు రూ. 146 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

    డోస్ పెంచేసిన సీరియల్ హీరోయిన్: బీచ్‌లో చిన్న క్లాత్‌తో కొత్త పెళ్లికూతురు రచ్చడోస్ పెంచేసిన సీరియల్ హీరోయిన్: బీచ్‌లో చిన్న క్లాత్‌తో కొత్త పెళ్లికూతురు రచ్చ

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?


    క్రేజీ కాంబోలో వచ్చిన 'రాధే శ్యామ్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 204 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 9 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 81.18 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 122.82 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను చేరుతుంది.

     శనివారం ఘోరం.. భారీ పరాభవం

    శనివారం ఘోరం.. భారీ పరాభవం


    రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' మూవీకి శనివారం కూడా దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. వీకెండ్‌లో ఊహించని విధంగా ఇంత తగ్గిపోవడంతో సినీ విశ్లేషకులే షాక్ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా రూ. 120 కోట్లకు పైగా వసూళ్లు ఈ చిత్రం రాబట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే అది సాధ్యమయ్యేది కష్టమే అని అందరికీ అనిపిస్తుంది.

    English summary
    Prabhas Did Radhe Shyam Movie Under Radha Krishna Kumar Direction. This Movie Collects Rs 81.18 Cr in 9 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X