»   » 50 డేస్ బాహుబలి-2: తెలుగులో ఎవరికీ అందనంత ఎత్తులో, ఇవీ లెక్కలు...!

50 డేస్ బాహుబలి-2: తెలుగులో ఎవరికీ అందనంత ఎత్తులో, ఇవీ లెక్కలు...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇండియన్ సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డుల మోత మ్రోగిస్తూ బాక్సాఫీసు రేసులో దూసుకెళ్లిన మాగ్నమ్ ఓపస్ ఫిల్మ్ బాహుబలి-2 విజయవంతంగా 50 రోజులను పూర్తి చేసుకుంది. కనీవినీ ఎరుగని రీతిలో బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం ఎవరూ అందుకోలేని శిఖరాలను అందుకుని యావత్ భారతదేశ ప్రేక్షకులను ఆశ్చర్య పరిచింది. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసింది.

బాహుబలి-2 రిలీజ్ ముందు వరకు ఇండియన్ సినీ పరిశ్రమలో అత్యధిక బాక్సాఫీసు స్కోరు రూ. 700 కోట్లు(పికె) పైచిలుకు మాత్రమే. అయితే ఆ రికార్డును చెరిపేయడంతో పాటు రూ. 1000 కోట్లు, రూ. 1500 కోట్ల మార్కును అందుకున్న తొలి ఇండియన్ మూవీగా చరిత్ర సృష్టించింది.


ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ కలెక్షన్

ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ కలెక్షన్

సినిమా విడుదలైన తొలి రోజే రూ. 121 కోట్లు వసూలు చేసిన రికార్డు క్రియేట్ చేసిన బాహుబలి-2 చిత్రం ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ రూ. 1676 కోట్లు వసూలు చేసింది.


తెలుగులో ఎవరూ అందుకోనంత ఎత్తులో

తెలుగులో ఎవరూ అందుకోనంత ఎత్తులో

తెలుగులో బాహుబలి చిత్రం సమీప కాలంలో ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు చేరుకుంది. బాహుబలి చిత్రం ఏపీ, తెలంగాణాల్లో కలిపి దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. షేర్ విషయానికొస్తే...లాస్ట్ వీకెండ్ నాటికి ఈ చిత్రం 196 కోట్లను టచ్ అయింది. ఇంకా పలు చోట్ల సినిమా విజయవంతంగా ప్రదర్శితం అవుతున్న నేపథ్యంలో 200 కోట్ల షేర్ మార్కును అందుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.


ఏపీలో రికార్డ్ కలెక్షన్

ఏపీలో రికార్డ్ కలెక్షన్

ఏపిలో బాహుబలి-2 మూవీ రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. 94 కోట్ల పైచిలుకు షేర్ సొంతం చేసుకుంది. ఇంత భారీ మొత్తం ఇప్పటి వరకు ఏ సినిమాకు రాలేదు.


హిందీలో రికార్డ్

హిందీలో రికార్డ్

హిందీలో బాహుబలి-2 మూవీ రూ. 500 కట్లు వసూలు చేసి.... ఈ మార్కును అందుకున్న తొలి హిందీ చిత్రంగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.


చైనా రిలీజ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో?

చైనా రిలీజ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో?

అమీర్ ఖాన్ ‘దంగల్' మూవీ చైనా రిలీజ్ తర్వాత బాహుబలి-2 వసూలు చేసిన రూ. 1500 కోట్ల మార్కును దాటేసి రూ. 2000 కోట్లను అందుకున్న సంగతి తెలిసిందే. జులైలో బాహుబలి-2 చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చైనా రిలీజ్ తర్వాత బాహుబలి-2 చిత్రం ‘దంగల్' రికార్డును బద్దలు కొడుతుందో? లేదో? చూడాలి.English summary
Prabhas-Rana Daggubati starrer Baahubali 2 completes 50 days. On its 50th day, the makers of Baahubali 2: The Conclusion have released a new set of posters from the Prabhas's film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu