500 కోట్ల క్లబ్‌లోకి కాంతార చాప్టర్ 1 ... 500 కోట్లు కొట్టిన సౌత్ హీరోలు ఎందరు.... టాప్‌‌లో ఎవరంటే?

హోంబలే ఫిలింస్ నిర్మాణంలో రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 మూవీ వరల్డ్ వైడ్‌గా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు నుంచి నేటి వరకు ఏ మాత్రం తగ్గకుండా వసూళ్లను సాధిస్తోంది. ఈ క్రమంలో కేవలం వారం రోజుల్లోనే 500 కోట్ల క్లబ్‌లో చేరి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. తద్వారా కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత 500 క్లబ్‌లో చేరిన రెండో కన్నడ సినిమాగా నిలిచింది. అలాగే రిషబ్ శెట్టి తన కెరీర్‌లో తొలిసారిగా 500 కోట్ల ఫీట్ సాధించాడు. కన్నడంలో మహామహులైన స్టార్ హీరోలు ఉన్నప్పటికీ రిషబ్ సత్తా చాటారు. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో 500 కోట్ల రూపాయలు వసూలు చేసిన సినిమాలు ఏంటీ? ఏ హీరోలు ఈ ఘనత సాధించారు? ఈ వివరాల్లోకి వెళితే...

Prabhas to Rishab Shetty South Indian heroes who join the 500 crore club Here s the details

ప్రభాస్:
పాన్ ఇండియా స్టార్‌గా దూసుకెళ్తున్న ప్రభాస్.. తన కెరీర్‌లో మొత్తం నాలుగు సార్లు 500 కోట్ల క్లబ్‌లో చేరారు. వీటిలో రెండు సినిమాలు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి ది బిగినింగ్ 650 కోట్ల రూపాయలు రాబట్టడంతో తొలిసారి తన కెరీర్‌లో 500 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరారు ప్రభాస్. ఆ తర్వాత జక్కన్న డైరెక్షన్‌లోనే వచ్చిన బాహుబలి ది కన్‌క్లూజన్ 1810 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది. తద్వారా కెరీర్‌లో తొలిసారిగా 1000 కోట్ల క్లబ్‌లో చేరారు ప్రభాస్. అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్‌ 702 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీ సినిమా ఏకంగా 1100 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టడంతో రెండోసారి 1000 కోట్ల క్లబ్‌లో చేరారు ప్రభాస్.

రజనీకాంత్:
సూపర్‌స్టార్ రజనీకాంత్ తన కెరీర్‌లో మొత్తం మూడు సార్లు 500 కోట్ల క్లబ్‌లో చేరిన హీరోగా ఘనత దక్కించుకున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.0 చిత్రం ఏకంగా 750 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడంతో రజనీ తొలిసారి 500 కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించారు. ఆ తర్వాత నెల్సన్ దర్శకత్వంలో తలైవా నటించిన జైలర్ మూవీ 650 కోట్లు సాధించింది. ఈ ఏడాది లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలీ చిత్రం 675 కోట్ల రూపాయల కలెక్షన్స్‌తో 500 కోట్లను మూడోసారి అధిరోహించారు రజనీకాంత్.

రామ్ చరణ్ , ఎన్టీఆర్, అల్లు అర్జున్
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు తొలిసారిగా 500 కోట్ల క్లబ్‌లో, 1000 కోట్ల క్లబ్‌లో స్థానం సంపాదించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 1400 కోట్ల రూపాయల వసూళ్లు సాధించడంతో పాటు ఆస్కార్ అవార్డ్ పొంది తెలుగు సినిమాను మరో మెట్టుపైకి ఎక్కించింది. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాతో బన్నీ తొలిసారిగా 500 కోట్ల క్లబ్‌లో, 1000 కోట్ల క్లబ్‌లో, 1500 కోట్ల క్లబ్‌లో ఏకకాలంలో అడుగుపెట్టారు. పుష్ప 2 మూవీ ఓవరాల్‌గా 1800 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించింది.

విజయ్ దళపతి, యశ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కెరీర్‌లో ఒకసారి 500 కోట్ల క్లబ్‌లో చేరారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో మూవీ 615 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇక కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ నటించిన మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. ఓవరాల్‌గా కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ వద్ద 1250 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. దాంతో తొలిసారిగా యశ్ 500 కోట్ల క్లబ్‌లో, 1000 కోట్ల క్లబ్‌లో స్ధానం సంపాదించడంతో పాటు ఈ ఘనత సాధించిన తొలి కన్నడ హీరోగా చరిత్ర సృష్టించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X