స్పిరిట్, కల్కి 2, ది రాజా సాబ్.. 2000 కోట్లు కలెక్ట్ చేసే ప్రభాస్ సినిమా ఇదే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. బాహుబలి, సాహో, కల్కి 2898 ఏడీ వంటి చిత్రాలతో ప్రభాస్ ఇండియాలో టాప్ హీరోగా ఎదిగారు. అయితే ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 2000 కోట్ల గ్రాస్ కలెక్షన్ రికార్డు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉంది. ఇక ఆ రికార్డును బ్రేక్ చేసేందుకు ప్రస్తుతం సౌత్ నుంచి అది కూడా టాలీవుడ్ హీరోలే ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్ ఆ రికార్డును చెరిపే దగ్గర వరకు వెళ్లి జస్ట్ లో మిస్ అయ్యారు.

ఇక ప్రస్తుతం మళ్లీ ప్రభాస్ రాబోయే చిత్రాలతోనే ఆ రికార్డును కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ రాబోయే చిత్రాలేమిటీ.. వాటి బడ్జెట్ అంచనా బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం తన రాబోయే చిత్రాలతో బిజీగా ఉన్నారు. డార్లింగ్ లైనప్ లో నెక్ట్స్ విడుదలకు ది రాజా సాబ్, ఆ తర్వాత ఫౌజీ, తర్వాత కల్కి 2898 ఏడీ సీక్వెల్, సలార్ 2 చిత్రాలు ఉన్నాయి. ఈ ఏడాది డిసెంబర్ 5న ది రాజా సాబ్ చిత్రం వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Prabhas Upcoming film have Expected 2000 Crore Collections At Box Office

అయితే ది రాజా సాబ్ చిత్రం రూ.300 కోట్ల బడ్జెట్ తో రూపుద్దుకుంటోంది. మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ తర్వాత ప్రేక్షకుల ముందుకు ఫౌజీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు చిత్రాలతో ప్రభాస్ 1000 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంటారని అంచనా వేస్తున్నారు. ఇక డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో రూపుదిద్దుకోబోతున్న చిత్రం 1500 కోట్ల రూపాయల గ్రాస్ వసూల్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకోవాల్సిన సలార్ : పార్ట్ 2 చిత్రానికి రూ.1200 కోట్ల వసూళ్లు అందుతాయని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్, మిస్టర్ పర్ఫెక్ట్ హీరో అమీర్ ఖాన్ పేరుపై ఉన్న 2000 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రం దంగల్ రికార్డును ప్రభాస్ తన చెరిపేయ గలడని ఊహిస్తున్నారు. అది కేవలం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న కల్కి 2తోనే సాధ్యమని అభిప్రాయపడుతున్నారు. హిందూ పురణాలను చెప్పే చిత్రం కావడం, బాహుబలి క్రేజ్ ఉన్న ప్రభాస్ లీడ్ రోల్ లో నటించడం, కల్కి అవతారం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆడియెన్స్ సినిమాపై ఆసక్తి చూపిస్తారని అలా ప్రభాస్ బాక్సాఫీస్ రికార్డులను చెరిపేస్తారని అంటున్నారు.

ఇప్పటికే నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన కల్కి 2898 ఏడీ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్ల గ్రాస్ వసూల్ కావడం విశేషం. ఇక మున్ముందు డార్లింగ్ సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందనేది చూడాలి. ఇక త్వరలో ప్రభాస్ - మారుతీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న రొమాంటిక్ హార్రర్ కామెడీ ఫిల్మ్ ది రాజా సాబ్ నుంచి సాంగ్స్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండటం విశేషం.

More from Filmibeat

Read more about: prabhas the raja saab kalki 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X