తమిళనాడులో KGF Chapter 2 ప్రభంజనం.. ఆ స్టార్ హీరో రికార్డు బ్రేక్‌తో సంచలనం

తమిళనాడు బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ చాప్టర్ 2 కలెక్షన్ల దుమారం కొనసాగుతూనే ఉంది. కన్నడ డబ్బింగ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయి విజయాన్ని అందుకొన్నది. తొలి వారంలోనే బాహుబలి, RRR లాంటి చిత్రాల వసూళ్లను అధిగమించి జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్నది. ఈ చిత్రం స్టార్ హీరో విజయ్ నటించిన బీస్ట్‌తో పోటీ పడుతూ రిలీజైంది. అయితే తమిళనాడులో విజయ్ సినిమా కంటే భారీగా వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాల హాట్ టాపిక్ అయింది.

విజయ్ నటించిన బీస్ట్ చిత్రం గత 8 రోజుల్లో 61.17 కోట్లు వసూలు చేస్తే.. కేజీఎఫ్2 ఆ కలెక్షన్లను అధిగమించింది. తమిళనాడులో కేజీఎఫ్2 చిత్రానికి సంబంధించిన వసూళ్ల విషయానికి వస్తే.. ఒక తమిళ సినిమాను మించి వసూళ్లను సాధించిన కన్నడ చిత్రంగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. ఇప్పటి వరకు ఓ కన్నడ మరో భాష చిత్రానికి సంబంధించిన వసూళ్లను అధిగమించిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.

Prashanth Neels KGF Chapter 2 breaks Beast Collections in Tamilnadu

అన్ని భాషల్లో కేజీఎఫ్2 సినిమా రికార్డులు సృష్టించడంపై ప్రశాంత్ నీల్ స్పందిస్తూ.. మేము ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు ఇంతటి ప్రభంజనాన్ని సృష్టిస్తుందని అనుకోలేదు. కేజీఎఫ్ మొదలుపెట్టినప్పుడు ప్యాన్ ఇండియా చిత్రంగా తీయాలని అనుకోలేదు. కేవలం కన్నడ సినిమా మొదలుపెట్టి.. ఆ తర్వాత రెండు భాగాలుగా చేయడంతో భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ విజయం, ఈ సినిమా వ్యూహాల వెనుక ఉన్న సీక్రెట్‌కు క్రెడిట్ అంతా నిర్మాత విజయ్, హీరో యష్‌కు మాత్రమే దగ్గుతుంది అని ప్రశాంత్ నీల్ అన్నాడు.

ఇదిలా ఉండగా.. ఉత్తరాదిలో కేజీఎఫ్2 ప్రభంజనం కొనసాగుతున్నది. హిందీలోనే ఈ చిత్రం 268 కోట్ల షేర్ సాధించింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కేజీఎఫ్2 ఓ ఘనతను సొంతం చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X