twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్చ్...రిలీజైన తెల్లారే థియోటర్స్ నుంచి తీసేసారు

    By Srikanya
    |

    హైదరాబాద్: రిలీజైన తొలిరోజే మినిమం ఓపినింగ్స్ కూడా తెచ్చుకోకపోతే ఆ సినిమాని ఆ థియోటర్ వాళ్లు ఎట్టి పరిస్దితుల్లోనూ భరించరు. థియోటర్ కు ఉండే మినిమం ఖర్చులు కూడా రాకపోతే వాటిని మరుసటి రోజే తీసేస్తారు. ఎందుకంటే థియోటర్ ని నమ్ముకుని వెహికల్స్ స్టాండ్ వాళ్లు, తినుబండారాలు అమ్మకాల వాళ్లు ఉంటారు. జనం లేకపోతే వారూ నష్టపోతారు. అందుకే మినిమం కలెక్షన్స్ లేని సినిమాని మొహమాటం లేకుండా తీసేసి వేరే సినిమాలు వేస్తూంటారు. ఇప్పుడు అలాంటి పరిస్ధితే ఛార్మీ నటించిన 'ప్రతిఘటన' చిత్రానికి వచ్చిందని ట్రేడ్ వర్గాల సమాచారం. దాదాపు చాలా థియోటర్స్ నుంచి తీసేసారని తెలుస్తోంది.

    మొన్న శుక్రవారం విడుదలైన 'ప్రతిఘటన' చిత్రం మినిమం ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేక చతికిల పడిందని, తొలిరోజే చాలా చోట్ల ఏడువందలు,ఎనిమిది వందలు కలెక్షన్ ఉండటంతో చాలా చోట్ల ఈ సినిమాని శనివారం నుంచి తీసేసారని అంటున్నారు. అయితే సినిమాలో మంచి కంటెంట్,సమాజానికి అందులోనూ ముఖ్యంగా ఎలక్షన్ సీజన్ లో పనికివచ్చే చిత్రం ఇలాంటి పరిస్ధితి ఎదుర్కోవటం బాధాకరమే అంటున్నారు. ఛార్మీ చాలా బాగా చేసిందని, సొంతంగా డబ్బింగ్ చెప్పుకుని మరీ పాత్రలో లీనం అయ్యిందని అంటున్నారు.తమ్మారెడ్డి భరధ్వాజ సైతం ఈ సినిమాని ఓ సామాజిక స్పృహతో నిర్మించి,దర్శకత్వం వహించారని,ఇలాంటి సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం సైతం ఉందని చెప్తున్నారు.

     Prathighatana only one day in Theatres

    నేటి రాజకీయాలపై వ్యగ్యాస్త్రంగా ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెరకెక్కించిన చిత్రం 'ప్రతిఘటన'. ఒడిషాలో ఇద్దరు యువతులపై జరిగిన అత్యాచార ఘటన నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. రాజకీయ నాయకుల ప్రవర్తన, రౌడీల తీరు, ఓటర్లను చైతన్యపరిచే పలు అంశాలను ఈ చిత్రంలో పొందుపర్చారు. ప్రధాన పాత్రలు పోషించిన ఛార్మి, రేష్మిల నటన అందరిని ఆకట్టుకుంటున్నాయి.

    దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ- ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భయ అత్యాచార ఉదంతం ప్రధానాంశంగా చిత్రాన్ని నిర్మించామని, కథ నచ్చడంతో అనేకమంది సాంకేతిక నిపుణులు ఉచితంగా పనిచేసారని, ఛార్మికూడా పారితోషికం లేకుండా నటించిందని తెలిపారు. ఒరిస్సాలో జరిగిన రూప్ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఆడవారిపై జరుగుతున్న అత్యాచారాల గురించి తెలుపుతూ, మనుషులు మారితేనే సమాజం, నాయకులు కూడా మారతారని ఇందులో చెప్పాం. మంచి రాజకీయ నాయకులు, పోలీస్ వ్యవస్థ ఉంటే సమాజం ఏ విధంగా ఉంటుందనేది అద్దం పట్టేలా చూపించాం. సామాజిక విలువలతో పాటు,వ్యాపారాత్మక విలువలు కూడా సినిమాలో ఉన్నాయి. బాధ్యతగల జర్నలిస్టుగా ఛార్మి నటించింది. ఆమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. భారతీయ మీడియాకు సినిమాను అంకిత మిస్తున్నాము అన్నారు. ఈ చిత్రానిక సంగీతం:కీరవాణి, కెమెరా:ఎస్.గోపాల్‌రెడ్డి, నిర్మాత, దర్శకత్వం:తమ్మారెడ్డి భరద్వాజ.

    English summary
    Charmi, Reshmi starrer ‘Pratighatana’ just collecting Rs 1000,Rs 800, Rs 700 only per show, theatre owners felt it will not be profitable to screen the film.Hence they have removed from the theatres from Saturday onwards.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X