»   » ‘ప్రేమకథా చిత్రమ్’ కలెక్షన్స్, నిర్మాత జాక్‌పాట్

‘ప్రేమకథా చిత్రమ్’ కలెక్షన్స్, నిర్మాత జాక్‌పాట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ప్రేమకథా చిత్రమ్ ఈ నెల 7న విడుదలై అంచనాలకు మించి బాక్సాఫీసు వద్ద ఫలితాలు సాధిస్తోంది. సినిమా ఇంట్రస్టింగ్ స్టోరీలైన్, స్క్రీన్ ప్లే, స్ర్కిప్టు..... నటీనటుల పెర్ఫార్మెన్స్ ఫలితంగా మంచి టాక్ తెచ్చుకోవడంతో కలెక్షన్ల పరంగా నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు సంతృప్తిని మిగిల్చింది.

మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో, జె ప్రభాకర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సినీ విమర్శకుల నుంచి కూడా మంచి ప్రశంసలు అందడంతో పాటు, పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో తొలిరోజైన శుక్రవారం ఈ చిత్రం ఓవరాల్‌గా రూ. 3.14 కోట్లు వసూలు చేసింది.

శనివారం ఈ చిత్రం కలెక్షన్స్ రూ. 2.90 కోట్లు రాగా, ఆదివారం మరో రూ. 2.58 కోట్లు వసూలు చేసింది. తొలి వీకెండ్ మూడు రోజుల్లో ఈచిత్రం మొత్తం రూ. 6.05 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కేవలం రూ. 2 కోట్లలోపు బడ్జెట్‌తోనే ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ కలెక్షన్స్ భారీగా రావడం, కలెక్షన్స్ మరింతగా వచ్చే అవకాశాలు బాగా ఉండటంతో నిర్మాత జాక్ పాట్ కొట్టినట్లయింది.

ఈ సినిమా మొత్తం నలుగురు వ్యక్తుల చుట్టూ, ఒకే ఇంట్లో సాగుతుంది. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలన్న ఆ నలుగురు నగర శివారులో గల గెస్ట్ హౌస్‌కు వెళతారు. ఆత్మహత్య చేసుకుందామనే సమయానికి ఓ దెయ్యం వీరిని ముప్పతిప్పలు పెడుతుంది. మరి దెయ్యం బారి నుంచి వారు ఎలా తప్పించుకున్నారు...ఆత్మహత్య చేసుకున్నారా? లేరా? అనేది తర్వాతి కథ.

English summary
Prema Katha Chithram released on the 7th of June worldwide amongst moderate expectations. he first day collection of the movie was 3.14 Crores. Collected 2.90 Crores on Saturday and on Sunday it collected another 2.58 Crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu