»   » పీఎస్వీ గరుడవేగ రికార్డు.. ఓవర్సీస్‌లో మూడోవారం కూడా దూకుడే..

పీఎస్వీ గరుడవేగ రికార్డు.. ఓవర్సీస్‌లో మూడోవారం కూడా దూకుడే..

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  పీఎస్వీ గరుడవేగ రికార్డు.. ఓవర్సీస్‌లో మూడోవారం కూడా దూకుడే

  టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నటించిన పీఎస్వీ గరుడ వేగ చిత్రం ఓవర్సీస్‌ మార్కెట్‌లో దుమ్ము రేపుతున్నది. ఈ చిత్రం అమెరికాలో హాఫ్ మిలియన్ మార్కును దాటింది. భారీ అంచనాలతో వచ్చిన చిత్రానికి ప్రేక్షకులు సానుకూలంగా స్పందించడంతో పీఎస్వీ గరుడ వేగ చిత్రం మూడవ వారంలో కూడా కలెక్షన్లపరంగా దూసుకెళ్తున్నది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నది.

   హాఫ్ మిలియన్ డాలర్ల కలెక్షన్లు

  హాఫ్ మిలియన్ డాలర్ల కలెక్షన్లు

  పీఎస్వీ గరుడవేగ 126.18ఎం చిత్రం అమెరికాలో 500K డాలర్లను వసూలు చేసింది. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. వారి సహకారం లేకపోతే ఈ రికార్డును గరుడవేగ చిత్రం సొంతం చేసుకొనేది కాదు అని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిసింది.

   ఆశ్చర్యానికి గురిచేస్తున్న వసూళ్లు

  ఆశ్చర్యానికి గురిచేస్తున్న వసూళ్లు

  జాతీయ అవార్డు పురస్కార గ్రహీత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన పీఎస్వీ గరుడవేగ చిత్రాన్ని ఓవర్సీస్ మార్కెట్‌లో జ్యోస్టార్ విడుదల చేసింది. ఈ చిత్రాన్ని వాల్‌పోస్టర్ సినిమాస్ పంపిణీ చేసింది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం విమర్శకులను సైతం మెప్పించడం విశేషం. ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు ట్రేడ్ పండితులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.


  ప్రతీఒక్కరికి థ్యాంక్స్

  ప్రతీఒక్కరికి థ్యాంక్స్

  రికార్డు కలెక్షన్లతో పీఎస్వీ గరుడవేగ చిత్రం దూసుకుపోతున్న నేపథ్యంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ చిత్రం ఘనవిజయం సాధించడం కోసం అహర్నిశలు కష్టపడిన టెక్నిషియన్స్, నటీనటులు, డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ ఓనర్లకు నా థ్యాంక్స్. ఈ విజువల్ వండర్‌ను ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు అని ప్రవీణ్ సత్తారు అన్నారు.


   హాలీవుడ్ స్థాయిలో గరుడవేగ

  హాలీవుడ్ స్థాయిలో గరుడవేగ

  హాలీవుడ్ ప్రమాణాల స్థాయిలో రూపొందించిన ఈ చిత్రాన్ని రూపొందించడంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న నిర్మాత కోటేశ్వరరాజు, ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లిన పంపిణీదారుల సేవలను మరువలేము అని ప్రవీణ్ సత్తారు ఓ ప్రకటనలో తెలిపారు.


  English summary
  'PSV Garuda vega 126.18M' has surpassed the coveted Half Million mark in US. The entire team of the action-thriller thanks our audience in the Overseas without whom this stunning feat wouldn't have been possible. Produced by JyoStar and distributed by WallPoster Cinemas, the film has been directed by the National award winner Praveen Sattaru. This masterpiece has stunned every critic, movie lover and trade pundit, proving that content is always the king anytime irrespective of any equation.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more