»   » అఫీషియల్ :'లోఫర్' ఆడియో, సినిమా విడుదల తేదీ

అఫీషియల్ :'లోఫర్' ఆడియో, సినిమా విడుదల తేదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ తేజ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'లోఫర్' . సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ సి.కళ్యాణ్‌ సమర్పణలో శ్రీశుభశ్వేత ఫిలింస్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ని, సినిమా విడుదల తేదీలను ఖరారు చేసారు నిర్మాతలు.

సి. కళ్యాణ్ మాట్లాడుతూ- ''వినోదం, మదర్ సెంటిమెంట్, హై యాక్షన్ ఈ చిత్రంలో ఉంటాయి. తక్కువ సమయంలో ట్రైలర్‌కి పది లక్షల క్లిక్స్ వచ్చాయి. పూరి దర్శకత్వంలో వచ్చిన రవితేజకు 'ఇడియట్', మహేశ్‌కు 'పోకిరి', ఎన్టీఆర్‌కు 'టెంపర్', రామ్ చరణ్‌కు 'చిరుత', అల్లు అర్జున్‌కు 'దేశముదురు'లా వరుణ్ కెరీర్‌లో ఈ చిత్రం మంచి మాస్ సినిమాగా మిగిలిపోతుంది. డిసెంబర్ 7న పాటలను, 18న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.


Puri Jagannadh’s 'Loafer' ready for release

వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ ''నా కెరీర్‌ బిగెనింగ్‌లోనే పూరి జగన్నాథ్‌ వంటి పెద్ద డైరెక్టర్‌తో పనిచేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. లోఫర్‌ సబ్జెక్ట్‌ వినగానే ఎంతో ఎగ్జైట్‌ అయ్యాను. పూరిగారి దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రం మంచి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా అందర్నీ ఆకట్టుకుని నా కెరీర్‌కి టర్నింగ్‌ పాయింట్‌ అవుతుంది'' అన్నారు.


Puri Jagannadh’s 'Loafer' ready for release

ఈ చిత్రంలో దిశా పటాని, బ్రహ్మానందం, రేవతి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, ముకేష్‌ రుషి, సంపూర్ణేష్‌ బాబు, సప్తగిరి, పవిత్ర లోకేష్‌, ఉత్తేజ్‌, భద్రమ్‌, శాండీ, ధనరాజ్‌, టార్జాన్‌, చరణ్‌దీప్‌, వంశీ, రమ్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కో రైటర్స్‌: కళ్యాణ్‌ వర్మ, కిరణ్‌, ఫైట్స్‌: విజరు, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: పి.జి.వింద, ఆర్ట్‌: విఠల్‌ కోసనం, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌.

English summary
Puri Jagannadh's Loafer is all set for release on 18th December 2015.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu