»   » ఫైనల్ గా గోపీచంద్ 'గోలీమార్' ఏమైంది? (ట్రేడ్ టాక్)

ఫైనల్ గా గోపీచంద్ 'గోలీమార్' ఏమైంది? (ట్రేడ్ టాక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

క్రితం వారం ఆదిత్యబాబు హీరోగా వచ్చిన చలాకి, కార్తీ, తమన్నాల ఆవారా చిత్రాలు విడుదల అయ్యాయి. అయితే రెండూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. చలాకీ అయితే మార్నింగ్ షో కే ప్లాప్ టాక్ తెచ్చుకుంటే ఆవారా యాక్షన్ చిత్రాభిమానులకు కొంత నచ్చి ఫరవాలేదనిపించుకుంటోంది. ఆవారా దర్శకుడు లింగు స్వామి గతంలో పందెం కోడి, రన్ వంటి హిట్ చిత్రాలు ఇచ్చి ఉండటం, తమన్నా హీరోయిన్ కావటం ఈ చిత్రం ఓపినింగ్స్ కి తోర్పడ్డాయి. ఇక అంతకుముందు వారం రిలీజైన యంగ్ ఇండియా, తెలియదు, ఆహా ఎంత అందం, రామ రామ కృష్ణ కృష్ణ చిత్రాలయితే పూర్తి స్ధాయి ప్లాఫ్ లుగా ముద్ర వేయించుకున్నాయి. అందరి బంధువయా చిత్రం మంచి చిత్రంగా పేరుతెచ్చుకున్నా ధియోటర్లలో ఆ మంచితనానికి చోటు లేకుండాపోయింది. ఉన్నంతలో ఇప్పటికీ సింహా నే బెటర్ అనిపించుకుంటోంది. నిన్న రిలిజయిన పూరీ జగన్నాధ్ 'గోలీమార్' చిత్రం అయితే ఫైనల్ గా ప్లాఫ్ అని తేల్చారు. గోపీచంద్ అభిమానులు కూడా ఈ చిత్రం నచ్చటం లేదని చెప్తున్నారు. ఇక ఇలాంటి యాక్షన్ చిత్ర దర్శక, నిర్మాతలు ఆశ పెట్టుకునే బి, సి సెంటర్లలో ఈ చిత్రం ఏ విధంగా వర్కవుట్ అవుతుందో చూడాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu