»   » పూరీ జగన్నాధ్ 'నేను నా రాక్షసి'ఫైనల్ రిజల్ట్ ఏమిటి?

పూరీ జగన్నాధ్ 'నేను నా రాక్షసి'ఫైనల్ రిజల్ట్ ఏమిటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రానా,ఇలియానా కాంబినేషన్ రూపొందిన నేను..నా రాక్షసి చిత్రం ఈ శుక్రవారం విడుదలైంది.పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మార్నింగ్ షో కే ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది.మాట్ని నుంచి చాలా చోట్ల కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి.వరస ఫ్లాఫుల్లో ఉన్న పూరీ జగన్నాధ్ కి ఇది కామన్ అని అనిపించినా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో రానా కి ఇది దెబ్బే. వారం తేడాలో రిలైజైన హిందీ చిత్రం దమ్ మారో దమ్,తెలుగు చిత్రం నేను నా రాక్షసి ప్లాప్ అవటం అతని సబ్జెక్టుల ఎన్నికలో అనుభవ రాహిత్యాన్నే చూపెడుతోందని అంటున్నారు.

ఇక ఇలియానా కూడా వరసగా ఫ్లాపులను ఎదుర్కొంటోంది.ఆమెకీ ఈ చిత్రం హిట్టు చాలా అవసరం.అయితే ఈ సినిమా ఆమెను పూర్తిగా నిరాశపరిచింది.ఆత్మహత్యల నేపధ్యంలో ప్రయోగం అంటూ రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల పాలిట శాపం అంటున్నారు.అంతలా కామన్ ప్రేక్షకుడుని విసిగించింది.అందులోనూ ఈ చిత్రం ఆత్మహత్యల గురించి,వాటిని చేసుకునే వారి మనోభావాలు గురించి చర్చింకపోవటంతో మేధావి వర్గం కూడా పెదవి విరుస్తోంది.

English summary
Nenu Naa Rakshasi movie which was released on Friday was declared as flop right after the first show was screened. Rana didn’t receive positive reviews for his recent Bollywood release Dum Maro Dum too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu