»   » ‘రేసు గుర్రం’ జోరుకు ‘బాద్ షా’ బాక్సు బద్దలైంది!

‘రేసు గుర్రం’ జోరుకు ‘బాద్ షా’ బాక్సు బద్దలైంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'రేసు గుర్రం' చిత్రం అమెరికా బాక్సాఫీసు వద్ద సెకండ్ వీక్‌లోనూ దుమ్ము రేపుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం రెండో వారాంతంలో ఇండియన్ బాక్సాఫీసు బిజినెస్ చార్ట్ లిస్టులో కలెక్షన్ల పరంగా రెండో స్థానంలో నిలిచింది. హిందీ చిత్రం '2 స్టేట్స్' మొదటి స్థానంలో ఉంది. విడుదలైన తొలి 9 రోజుల్లో 1 మిలియన్ డాలర్ల మార్కును దాటేసిన రేసు గుర్రం....ఇప్పటి వరకు 'బాద్ షా' సినిమా పేరుతో ఉన్న లైఫ్ టైమ్ కలెక్షన్ రికార్డును బద్దలు కొట్టింది.

ఏప్రిల్ 10వ తేదీన 66 స్క్రీన్లలో విడుదలైన 'రేసుగుర్రం' చిత్రం తొలి వారాంతం ముగిసేనాటికి (మొత్తం 8 రోజులు) రూ. 5.93 కోట్లు వసూలు చేసింది. పోటీలో ఇతర తెలుగు సినిమాలేవీ లేక పోవడంతో 'రేసు గుర్రం' చిత్రం రెండో వారంలోనూ హవా కొనసాగిస్తోంది. అయితే తొలి శుక్రవారంతో పోలిస్తే....రెండో శుక్రవారం 60% బిజినెస్ డ్రాప్ అయింది.

 Race Gurram Beats NTR's Baadshah Collection Record At Box Office

సినిమా విడుదలైన 9వ రోజు (రెండో శుక్రవారం) 'రేసు గుర్రం' చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద 1 మిలియన్ డాలర్ల మార్కను దాటేసింది. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఇందుకు సంబంధించిన విషయలు వెల్లడిస్తూ...'రేసు గుర్రం చిత్రం యూఎస్ఏలో పట్ట పగ్గాల్లేకుండా దూసుకెలుతోంది. రెండో వారం : శుక్రవారం 82,062. మొత్తం: $ 1,064,217 (రూ. 6.42 కోట్లు). ఫెంటాస్టిక్ కలెక్షన్ష్' అంటూ ట్వీట్ చేసారు.

రెండో వారంలో 'రేసు గుర్రం' చిత్రం 53 స్క్రీన్లలో ప్రదర్శితం అవుతూ...రూ. 1.49 కోట్లు($ 245,726) వసూలు చేసింది. 11వ రోజు నాటికి అమెరికా కలెక్షన్ మొత్తం రూ. 7.42 కోట్లు ($ 1,227,881). గతంలో జూ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'బాద్ షా' చిత్రం 6 వారాల పాటు యూఎస్ఏలో ప్రదర్శితమై రూ. 7.02 కోట్లు ($ 1,281,249) వసూలు చేసింది.

English summary
Director Surender Reddy's recent release Race Gurram has continued to rock the viewers in America in the second week too. The Allu Arjun and Shruti Hassan starrer has once again made superb collection at the USA Box Office in the second weekend and landed in the second place, while Hindi film 2 States topped the business chart. Having crossed $ 1 million mark in nine days, the film has also beaten the life-time collection record of Junior NTR's Baadshah.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu