»   » ‘రేసు గుర్రం’ ఫస్ట్ డే బంపర్ కలెక్షన్స్, ఎంతంటే..?

‘రేసు గుర్రం’ ఫస్ట్ డే బంపర్ కలెక్షన్స్, ఎంతంటే..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'రేసు గుర్రం' చిత్రం శుక్రవారం విడుదలైన సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు వెయ్యికి‌పైగా థియేటర్లలో విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద బంపర్ ఓపెనింగ్స్ సాధించింది.

తొలి రోజు ఈచిత్రం కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే రూ. 6.3 కోట్లు వసూలు చేసింది. ఇతర ప్రాంతాల్లో కూడా వసూలు చేసిన మొత్తం జత అయితే ఈ మొత్తం మరింత పెరగనుంది. తొలి వీకెండ్ ముగిసే నాటికి ఆంధ్రప్రదేశ్‌లో రూ. 15 కోట్లపైనే వసూలు అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు త్రినాథ్ అంచనా వేస్తున్నారు.

'Race Gurram' minted Rs.6.3 crore on its opening day

'రేసు గుర్రం' చిత్రం ఇటీవల విడుదలైన హిట్ మూవీ 'లెజెండ్' చిత్రానికి మంచి ఫాలో అప్ ఇస్తుందని త్రినాథ్ తెలిపారు. బిజినెస్ ఈ రేంజిలో సాగడం సమ్మర్లో విడుదలయ్యే ఇతర పెద్ద సినిమాలకు కూడా శుభ సూచకమని తెలిపారు. 'రేసు గుర్రం' చిత్రం అన్ని ఖర్చులూ కలుపుకుని థియేటర్లోకి వచ్చే సమయానికి రూ. 52 కోట్ల బడ్జెట్ అయిందని తెలుస్తోంది.

కోట శ్రీనివాసరావు, సుహాసిని మణిరత్నం, ప్రకాష్‌రాజ్, అలీ, ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, నవాజ్ సోనూ తదితరులు నటించారు. ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: ఎస్.తమన్, కూర్పు: గౌతంరాజు, నిర్మాతలు: నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.

English summary

 Actor Allu-Arjun starrer Telugu actioner "Race Gurram", which released Friday in cinemas, has minted Rs.6.3 crore on its opening day in Andhra Pradesh. It is expected to rake in over Rs.15 crore in the opening weekend, predicts a trade pundit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu