twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Radhe Shyam : డే1 ఆల్ టైమ్ రికార్డ్.. నైజాంలో సెన్సేషన్.. క్లాస్ మూవీకి మాస్ ఓపెనింగ్!

    |

    రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'రాధే శ్యామ్' సినిమా కోసం అభిమానులు చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2019లో సాహో సినిమాతో ప్రేక్షకుల తర్వాత ప్రభాస్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. పీరిడికల్ బ్యాక్ డ్రాప్‌లో ఇటలీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అయితే మొదటి రోజే హైదరాబాద్ లో ఆల్ టైం రికార్డు సెట్ చేసింది రాధేశ్యామ్. ఆ వివరాల్లోకి వెళితే...

    Recommended Video

    Radhe Shyam : Rebel Star Prabhas Interacts With Media Live | Filmibeat Telugu (2)
    విక్రమాదిత్యగా

    విక్రమాదిత్యగా

    ప్రభాస్ విక్రమాదిత్య అనే హస్త సాముద్రికుడి పాత్రలో నటించగా పూజా హెగ్డే ప్రేరణ అనే ఒక డాక్టర్ పాత్రలో నటించింది. బిల్లా, రెబల్ సినిమాల తర్వాత రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ సినిమాలో ఆయన పరమహంస అనే కీలక పాత్రలో నటించారు. ఇతర ముఖ్య పాత్రల్లో జగపతి బాబు, భాగ్యశ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి నటించారు. అలాగే ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా తెరకెక్కించగా వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు.

     స్టార్ల గాత్ర దానం

    స్టార్ల గాత్ర దానం


    తెలుగులో రాజమౌళి, హిందీలో అమితాబ్ బచ్చన్, కన్నడలో పునీత్ రాజ్‌కుమార్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా కోసం గాత్ర దానం చేశారు. ఈ సినిమాకు వివిధ భాషల్లో వేరు వేరు సంగీత దర్శకులు పనిచేశారు. దక్షిణాదికి జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించగా తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. హిందీ కోసం వేరే సంగీత దర్శకులు పని చేశారు.

    ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్

    ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్


    ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 7000కు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసిందనేది పరిశీలిస్తే సీడెడ్ (రాయలసీమ)లో రూ. 18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 13 కోట్లు, ఈస్ట్ లో రూ. 8.80 కోట్లు, వెస్ట్ లో రూ. 7.50 కోట్లు, గుంటూరులో రూ. 9.90 కోట్లు, కృష్ణాలో రూ. 7.50 కోట్లు, నెల్లూరులో రూ. 4 కోట్లు కలిపి తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ 105.20 కోట్లు మార్కెట్ చేసింది.

    బ్రేక్ ఈవెన్ ఎంత అంటే?

    బ్రేక్ ఈవెన్ ఎంత అంటే?


    కర్ణాటకలో రూ. 12.50 కోట్లు తమిళనాడులో రూ. 6 కోట్లు కేరళలో రూ. 2.10 కోట్లు హిందీలో రూ. 50 కోట్లు రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు ఓవర్సీస్ లో రూ. 24 కోట్లు అలా ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ. 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 204 కోట్ల రాబట్టాలి. సినిమా థియేట్రికల్ రైట్స్ కాకుండా డిజిటల్, శాటిలైట్ రూపంలో రూ. 100 కోట్లు నిర్మాతలకు దాకా అందినట్టు సమాచారం

     ఆల్ టైం రికార్డు

    ఆల్ టైం రికార్డు


    అయితే రాధే శ్యామ్ హైదరాబాద్ సిటీ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 6.5 కోట్ల మార్కును క్రాస్ చేసింది, ఇది ఒక సంచలనం అని అంటున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ సినిమాలకు ఇది డే1 ఆల్ టైమ్ రికార్డ్ అని అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. క్లాస్ సినిమాతో మాస్ ఓపెనింగ్స్ నైజాంలో ప్రభాస్ క్రేజ్ తోనే జరిగాయని అభిమానులు అంటున్నారు.

    English summary
    Radhe Shyam Day 1 Hyderabad Box Office Collections: Prabhas Creates All Time Record
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X