»   » బాక్సాఫీసు టాక్: ఈ సినిమా కూడా ప్లాపే...

బాక్సాఫీసు టాక్: ఈ సినిమా కూడా ప్లాపే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్ హీరోగా, నందమూరి తారక రత్న విలన్ పాత్రలో తెరకెక్కిన చిత్రం 'రాజా చెయ్యి వేస్తే'. విడుదలకు ముందు ఈ సినిమాపై ఓ మెస్తరు అంచనాలు ఉండేవి. దీంతో ఈసారైనా నారా రోహిత్ కెరీర్లో హిట్టు పడుతుంది అంతా అనుకున్నారు. కానీ తాజాగా ట్రేడ్ వర్గాల అనుండి అందుతున్న సమాచారం ప్రకారం సినిమా బాక్సాఫీసు రిజల్ట్ మాత్రం సంతృప్తి కరంగా లేదని తెలుస్తోంది. ఈ సినిమా కూడా ప్లాప్ లిస్టులో చేరిపోయిందని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నారా రోహిత్ గత చిత్రాలు తుంటరి, సావిత్రి చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డ సంగతి తెలిసిందే.

ఇప్పటి వరకు హీరోగా మాత్రమే సినిమాలు చేసిన తారక రత్న....'రాజా చెయ్యి వేస్తే' చిత్రం ద్వారా తొలిసారి విలన్ పాత్రలో ప్రేక్షకులు పరిచయం అయ్యారు. సినిమా సంగతెలా ఉన్నా తారకరత్న విలన్ పెర్ఫార్మెన్స్ కు మాత్రం మంచి మార్పులు పడ్డాయి. ఈ సినిమా పోయినా తారక రత్నకు టాలీవుడ్లో విలన్ అవకాశాలు రావడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.


దీంతో ధనుష్ నటించిన తమిళ చిత్రం తెలుగులో అనువాదం అయి 'మాస్' పేరుతో రిలీజైంది. ఈ చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ టాకే తెచ్చుకుంది. ధనుష్ గత చిత్రాలైన కాస్త బెటరేమో గానీ ఈ చిత్రం వసూళ్లు మాత్రం మరీదారుణంగా ఉన్నాయని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.


Raja Cheyyi Vesthe boxoffice report

గత వారం, అంతకు ముందు వారం... విడుదలై ప్రస్తుతం బాక్సాఫీసు రేసులో హిట్ టాక్ తో, లాభాలతో దూసుకెలుతున్న ఒకే ఒక్క చిత్రం అల్లు అర్జున్ నటించని 'సరైనోడు' చిత్రం మాత్రమే. ఈ చిత్ర రూ. 100 కోట్ల గ్రాస్ సాధించడంతో పాటు, రూ. 50 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అల్లు అర్జున్ కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.


ఇక మొన్న విడుదలైన సాయి ధరమ్ తేజ్ 'సుప్రీమ్' మంచి ఓపెనింగ్స్ సాధించింది. సాయి ధరమ్ తేజ్ కు ఉన్న మెగా ఇమేజ్ తో పాటు, పటాస్ దర్శకుడు అనిల్ రావిపూడి, దిల్ రాజు చిత్రం కావడంతో సినిమాకు ఓపెనింగ్స్ సంతృప్తికర స్థాయిలో వచ్చాయి. కామెడీ ఉండటంతో సినిమా టాక్ కూడా బావుంది. కామెడీ చూసి ఎంజాయ్ చేయడానికైనా జనాలు థియేటర్‌కు వెలుతున్నారు. సూర్య నటించిన '24' చిత్రం నిన్న విడుదలై మంచి ఓపెనింగ్స్ సాధించింది.

English summary
Nara Rohit had to taste the another failure with this year with “Raja Cheyyi Vesthe.As a result, it turned out to be yet another disaster.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu