twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి 'ఈగ' ప్రారంభం కాకుండానే మరో రికార్డు

    By Srikanya
    |

    ఎస్.ఎస్.రాజమౌళి తాజా చిత్రం ఈగ ఫిబ్రవరి 21 వ తేదీ నుంచి సెట్స్ మీదకు వెళ్తోంది. సమతం,నాని,కన్నడ స్టార్ సుదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో గ్రాఫిక్స్ కీలక పాత్రను పోషించనుంది. చిత్రం ప్రారంభం కాకుండానే తమిళ డబ్బింగ్ రైట్స్ రికార్డు రేటుకు అమ్ముడు పోయనట్లు తెలుస్తోంది. తమిళంలో ఓ ప్రముఖ సంస్ధవారు ఈ రైట్స్ ని పొందారు. తెలుగులో ఏ హీరో చిత్రం డబ్బింగ్ రైట్స్ ఈ రేంజిలో వర్కువుట్ కాలేదు. మరో ప్రక్క ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ఛానెల్స్ వారు ఈ నిర్మాతలను ఊపిరి తీసుకోనివ్వటం లేదని చెప్తున్నారు. , ఈ చిత్రంలో వెంకటేష్ తో వాయిస్ ఓవర్ చెప్పించటం ద్వారా ఫ్యామిలీలకు పట్టే చిత్రమని చెప్పబోతున్నారు.

    ఇక తన సినిమాలోని కథాంశం ఏమిటో ఓపెనింగ్ రోజునే ఓపెన్ గా రాజమౌళి చెప్పేసారు.'ఈగ" సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ"గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై..అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ"ఎలా గెలిచిందీ..ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ" కథాంశం.

    సురేష్ ప్రోడక్షన్ సమర్పణలో ఈచిత్రాన్ని సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈసినిమాకి హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలకు ఛాయాగ్రాహాకుడిగా వ్యవహారించిన జేమ్స్ పౌల్ ఈసినిమాకి కెమెరా మ్యాన్ గావ్యవహారిస్తున్నారు. ఈగ సినిమాకి యం యం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

    English summary
    Eega stars Nani and Samantha in the lead roles while Kannada star Sudeep plays an important role in the film. The film revolves between a man and a fly weaved with commercial facets. Surprisingly the Tamil dubbing rights of the film were bagged by a well-known Tamil producer for an all-time record price even before the film kicked off with the shooting.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X