»   »  ‘కబాలి’ తెలుగు రైట్స్ కొనేసారు, రేట్ ఎంతో చెప్తే మీరు షాక్ అవుతారు

‘కబాలి’ తెలుగు రైట్స్ కొనేసారు, రేట్ ఎంతో చెప్తే మీరు షాక్ అవుతారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: 'లింగ' తర్వాత రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'కబాలి'. పా.రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కలైపులి థాను నిర్మిస్తున్న ఈ సినిమాలో రాధికా ఆప్తే హీరోయిన్. చిత్రంలో రజనీకాంత్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులోనూ భారీ ఎత్తున విడుదలకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

జూలై 1,2016 న విడుదల అయ్యే ఈ చిత్రం తెలుగు రైట్స్ కోసం పెద్ద నిర్మాతలు సైతం క్యూలో నిలబడ్డారు. అయితే ప్రవీణ్ చౌదరి అనే కొత్త నిర్మాత తమ షన్ముఖ పిక్చర్స్ బ్యానర్ పై ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.


చిత్రం రైట్స్ రేటు విషయానికి వస్తే ...ట్రేడ్ వర్గాలను షాక్ కు గురిచేసిన రేటే అది. 32 కోట్ల రూపాయలకు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. అలాగే ఈ రేటు శాటిలైట్ రైట్స్ కలిపి కాకుండా కావటం మరో షాకింగ్ న్యూస్. అంటే తెలుగు శాటిలైట్ రైట్స్ వేరేగా అమ్ముతారన్నమాట. కేవలం ధియేటర్ రైట్స్ కే 32 కోట్లు వెచ్చించారంటే ఇక బిజినెస్ ఏ రేంజిలో జరుగుతుందో చూడాలి.


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పలురకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటన్నింటికి ఏమాత్రం సంబంధం లేకుండా తమ సినిమా ఉంటుందని దర్శకుడు రంజిత్‌ చెబుతున్నారు.


అలాగే ఈ చిత్రం టీజర్ ఇప్పటికే విడుదలై సూపర్ హిట్టైంది. ఈ నేఫధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం ఊపందుకుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... తెలుగు,తమిళ, హిందీ, జపనీస్, మలై భాషల్లో రిలీజ్ అవుతోంది. దాంతో ఈ చిత్రం బిజినెస్ రెండు వందల కోట్లు వరకూ అవుతోందని చెప్తున్నారు.


Rajani's Kabali’s Telugu Right Sold Out

ఇక ఈ చిత్రం ఆడియో విడుదల వేడుకను ఈ నెల తొమ్మిదో తేదీన నిర్వహించాలని ఆరంభంలో భావించారు. 12వ తేదీన కార్యక్రమాన్ని ఖరారు చేశారు. ఈ చిత్రానికి కపిలన్‌ పాటలు రాశారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూర్చారు. ప్రస్తుతం గ్రాఫిక్స్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అవి కూడా వారం, పదిరోజుల్లో పూర్తికానున్నట్లు సమాచారం.


12వ తేదీన ఆడియో విడుదల కార్యక్రమాన్ని భారీఎత్తున నిర్వహించాలని థాను భావిస్తున్నారు. వైఎంసీఏ మైదానంలోగానీ, నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలోగానీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అన్ని జిల్లాల నుంచి రజనీకాంత్‌ అభిమానులను ఆహ్వానించనున్నారు.


ఇందులో ప్రముఖ నటీనటులు, సాంకేతిక కళాకారులు కూడా పాల్గొననున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమెరికాలో కుటుంబంతో కలిసి విశ్రాంతి తీసుకుంటున్నారు రజనీకాంత్‌. పదో తేదీన చెన్నైకి రానున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే నెల ఒకటో తేదీన తెరపైకి తీసుకురానున్నట్లు నిర్మాత ఇప్పటికే ప్రకటించారు.

English summary
Praveen Chowdary has acquired the Telugu rights of 'Kabali' under Shanmukha Pictures banner.Buzz says, Shanmukha Pictures got the Telugu rights for 32 crores (Excluding Satellite Rights).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu