For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సమస్యలో ‘కబాలి’ తెలుగు వెర్షన్, దాసరి జోక్యం, ధియోటర్స్ ఇవ్వం

  By Srikanya
  |

  హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 'కబాలి' చిత్రం విడుదలకు ముందే రోజుకో విశేషంతో వార్తల్లో నిలుస్తోంది. అయితే అన్నీ పాజిటివ్ వార్తలు కావు. కొన్ని అభిమానులను బాధపెట్టే వార్తలు సైతం ఉన్నాయి. అలాంటిదే ఇప్పుడు చెప్పబోయే వార్త. తెలుగులో కబాలి రిలీజ్ విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అదేంటి ఆల్రెడీ రిలీజ్ డేట్ తో పోస్టర్ వచ్చేసింది కదా అంటారా. అయితే మీరు ఈ కథనం చదవాల్సిందే.

  ఇప్పటికే సెన్సార్‌ పూర్తయిన 'కబాలి' చిత్రం ఇదే నెల 22న విడుదల చేస్తున్నట్టు నిర్మాత ప్రకటించారు. ఇక్కడా అదే రోజు రిలీజ్ ఉంటుంది. అంటే ఈ పాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు ముందుగానే కన్‌ఫర్మ్‌ కావాలి. కానీ నిన్నటి వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్ల నిర్ణయం జరగలేకపోవటం అందరినీ ఆశ్చర్యపరిచింది.

  అందుతున్న సమాచారం మేరకు థియేటర్ల యాజమాన్యాలు 'కబాలి' చిత్ర ప్రదర్శనకు సుముఖంగా లేవని తెలిసింది. అవసరమైతే 'కబాలి' రిలీజ్‌ను అడ్డుకోవడానికి పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామం వెనుక ఆసక్తిక రమైన విషయాలు అనేకం ఉన్నాయి. ఎందుకిలా జరుగుతోంది అంటే...'కబాలి' సినిమా తెలుగు వెర్షన్ విడుదల ఆపడానికి ఆర్థిక లావాదెవీలే కారణం అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

  ఈ సమస్య పరిష్కారం కోసం సినీ పెద్ద దాసరి నారాయణరావు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివాదం పెద్దదికాకుండా సామరస్య పూర్వకంగా పరిష్కారం కావాలని ఆయన భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ సమస్యలో కీలకపాత్రధారైన రజనీకాంత్.. అమెరికాలో ఉండడం వల్ల ఆయనతో సంప్రదించడం సమస్యగా మారింది.

  అసలీ సీరియస్ మ్యాటర్ వెనక అసలు ఏంజరిగింది...స్లైడ్ షోలో

  అదే కారణం

  అదే కారణం

  ఈ వివాదానికి నాలుగేళ్ళ క్రితం రజనీ నటించిన ‘కొచ్చాడియాన్‌' (తెలుగులో విక్రమసింహా) సినిమానే కారణం. ఆ సినిమా డిజాస్టర్ కావటంతో ఆ ఆర్దిక లావాదేవీలు కొన్ని ఇంకా క్లియర్ కాలేదు.

  పది కోట్లుకు కొన్నారు

  పది కోట్లుకు కొన్నారు

  ‘కొచ్చాడియాన్‌' రజనీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించగా, చిత్రానికి సంబంధించిన ఆర్థికలావాదేవీలను రజనీకాంత్‌ సతీమణి లత చూశారు. ఈ చిత్రం తెలుగు హక్కులను లక్ష్మీగణపతి ఫిలింస్‌ సంస్థ సుమారు 10 కోట్లకు కొనుగోలు చేసింది.

  రిలీజ్ వాయిదా

  రిలీజ్ వాయిదా

  2012లో రజనీ బర్త్‌డే సందర్భంగా డిసెంబర్‌ 12న రిలీజ్‌ కావాల్సిన ఈ చిత్రం పలు కారణాల వల్ల వాయిదా పడుతూ 2014లో రిలీజైంది. ఆలస్యం కారణంగా లక్ష్మీగణపతి సంస్థ ఈ చిత్రం హక్కులు వదులుకునేందుకు సిద్దపడి ఈ విషయాన్ని లతకు తెలియజేశారు. దీనిపై వెంటనే లత స్పందించలేదు.

  అడ్వాన్స్ గా...

  అడ్వాన్స్ గా...

  చివరగా ‘కొచ్చాడియన్‌' రిలీజ్‌ తేదీ సమీపించాక 10 కోట్లను డిస్ట్రిబ్యూషన్‌ అడ్వాన్స్‌గా పరిగణిస్తామని, సినిమాను రిలీజ్‌ చేయమని కోరిందట. నేరుగా లత నుండి హమీ లభించడంతో ‘కొచ్చాడియన్‌' తెలుగులో రిలీజైంది. కానీ ప్రేక్షకారణ లభించలేదు.

  రెండున్నర కోట్లే రికవరి..

  రెండున్నర కోట్లే రికవరి..

  కేవలం రెండున్నర కోట్ల మాత్రమే రికవరీ అయింది. మిగతా మొత్తం అంటే 7.50 కోట్లు డిస్ట్రిబ్యూషన్‌ అడ్వాన్స్‌ కాబట్టి తిరిగి ఇవ్వాల్సిందిగా రజనీకాంత్‌ సతీమణి లతను కోరితే ఆమె నుండి ఎలాంటి స్పందన లేదు.

  నో అపాయింటమెంట్

  నో అపాయింటమెంట్

  పదే పదే ఫోన్‌ ద్వారా, మెయిల్స్‌ ద్వారా సంప్రదించినప్పటికీ లాభం లేకపోయింది. సంస్థ ప్రతినిధులు పలుమార్లు చెన్నై చేరుకుని రజనీకాంత్‌ని కలిసే ప్రయత్నం చేసినప్పటికీ అపాయింట్‌మెంట్‌ దొరకలేదట.

  అప్పటినుంచీ..

  అప్పటినుంచీ..

  ఏడున్నర కోట్ల రూపాయలను ఎట్టిపరిస్థితుల్లో లత నుండి వసూలు చేసి తెలుగు నిర్మాతకు ఇప్పించాలనే ప్రయత్నాలు సీరియస్‌గా జరుగుతున్నాయి. ఈ వివాదంపై చిత్ర సంబంధికుల నుండి ఇప్పటి వరకు సమాచారం లేదు. అయితే ఆదివారం పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు సమావేశం అయ్యారు.

  కబాలి ఆపేస్తాం..

  కబాలి ఆపేస్తాం..

  రజనీకాంత్‌ సతీమణి లతా నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన హామీ లభించకపోవడంతో చివరికి ‘కబాలి' సినిమా రిలీజ్‌కు బ్రేక్‌ వేసే వరకు పరిస్థితి చేరుకుంది.

  దాసరి దృష్టికి

  దాసరి దృష్టికి

  దాసరి నారాయణరావు దృష్టికి తీసుకెళ్ళి న్యాయం కోసం అభ్యర్థించగా ఆయన ఒక పెళ్లి నిమిత్తం హైదరాబాద్‌ వచ్చిన రజనీకాంత్‌కు విషయం తెలిపారట. సమస్యను పరిష్కరించాల్సింది అంటూ ‘లింగ' చిత్ర నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌కు రజనీ అప్పజెప్పారు. అయినప్పటికీ నిర్మాతలకు డబ్బు తిరిగిరాలేదు.

  ఒకే తాటిపై

  ఒకే తాటిపై

  చెన్నై, బెంగుళూరు పలుమార్లు తిరిగినా న్యాయం జరగలేదు. దీంతో ఒక తెలుగు నిర్మాతకు జరిగిన అన్యాయం గురించి టాలీవుడ్‌ పంపిణీ దారులు, థియేటర్ల యాజ మాన్యాలు ఒక్క తాటిపై నిలిచాయి.

  కష్టం..

  కష్టం..

  తెలుగు నిర్మాతకు డబ్బులు తిరిగి ఇచ్చేవరకు ‘కబాలి'కి సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించుకు న్నాయి. సోమవారం వరకు థియేటర్ల నిర్ణయం జరక్క పోతే ‘కబాలి ‘ తెలుగు రాష్ట్రా ల్లో రిలీజ్‌ అవడం కష్ట మని ఎగ్జిబిటర్లు అంటున్నారు.

  పోటీలో

  పోటీలో

  ‘కబాలి' తెలుగు హక్కుల కోసం చాలామంది నిర్మాతలు పోటీపడ్డారు. ‘కబాలి ‘ నిర్మాత భారీ ధర చెప్పడంతో కొంతమంది తప్పుకున్నారు. సినీపరిశ్రమలో ఎలాంటి అనుభవం లేని గుంటూరుకు చెందిన ఒక వ్యక్తి భారీ మొత్తం చెల్లించి కబాలి తెలుగు రైట్స్‌ కొన్నారని తెలిసింది. ఆయనకు పరిశ్రమలోని కొందరు ప్రముఖులు ఫైనాన్స్‌ చేసి కొనిపించారని ప్రచారం జరుగుతోంది.

  ధియోటర్స్ ఇవ్వం

  ధియోటర్స్ ఇవ్వం

  ఇప్పుడు ‘కబాలి' రిలీజ్‌ డేట్‌ ప్రకటించడంతో పరిశ్రమలో కదలిక వచ్చింది. అందరు ఐకమత్యంగా ఉంటే సాటి నిర్మాతకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. శనివారం నాడు జరిగిన సమావేశంలో కూడా థియేటర్లు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.

  అయితే

  అయితే

  లత చేసిన అప్పుకు రజనీకాంత్‌కు సంబంధం లేదని కొన్నవారంటున్నారు. ‘కబాలి' నిర్మాత పేరు వేరే ఉన్నప్పటికీ రజనీకాంత్‌కు ఇది సొంత చిత్రమని, బినామిగా వేరే పేరుతో తీస్తున్నారని తెలుగు నిర్మాతలు ఆరోపిస్తున్నారు.

  మరో ప్రక్క

  మరో ప్రక్క

  ఎయిర్‌ ఏషియా స్పెషల్‌ ప్యాకేజ్‌, కబాలి యాప్‌, కబాలి ఇమోజీ, వెండి నాణెలు ఇలా పలు విధాలుగా రజనీకాంత్‌ తన సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ను చాటుకున్నారు.

  టిక్కెట్లు అయ్యిపోయాయి

  టిక్కెట్లు అయ్యిపోయాయి

  జులై 22 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్న ఈ చిత్రాన్ని అమెరికాలో 400 స్క్రీన్లపై విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ ముందస్తు బుకింగ్‌లో ఈ చిత్రం టికెట్లు కేవలం రెండు గంటల్లోనే అయిపోయినట్లు సమాచారం. ఇది ఆశ్చర్యాన్ని కల్గిస్తున్నా.. నమ్మక తప్పని సత్యం అంటున్నారు సినీ వర్గాలు.

  టీమ్

  టీమ్

  పా రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కలైపులి ఎస్‌ థను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోష్‌ నారాయణన్‌ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో రజినీకాంత్‌ సరసన రాధికా ఆప్టే నటించారు.

  English summary
  Rajinikanth's Kabali telugu version producers are battling many odds to see the film light of its day in Telugu as the Telugu producer of Rajini's Kochadaiyaan wants his dues to be paid before the release of Kabali.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X