»   » రజనీ 'కబాలి' తెలుగు టైటిల్ ఏంటి?

రజనీ 'కబాలి' తెలుగు టైటిల్ ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : రజనీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'కబాలి' ఫస్ట్ లుక్ మొన్న వినాయిక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేసారు దర్శక,నిర్మాతలు. ఈ ఫస్ట్ లుక్ అంతటా మంచి క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం కోసం మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు ఏం టైటిల్ పెట్టాలనేది ఇప్పుడు యూనిట్ కు పెద్ద సమస్యగా మారిందని అంటున్నారు.

తెలుగు మార్కెట్ ని ఎట్రాక్ట్ చేయాలి అంటే... ఏ టైటిల్ పెడితే బాగుంటుదని అనే ఆప్షన్స్ వెతుకుతున్నట్లు చెప్తున్నారు. అయితే కొందరు తెలుగుకు సైతం కబాలి అనే టైటిల్ పెట్టినా ఏ సమస్యా ఉండదని సలహా ఇచ్చినట్లు సమాచారం. గతంలో భాషా, ముత్తు టైటిల్స్ లాగానే ఇక్కడ ఈ కబాలి కూడా జనాల్లోకి వెళ్తుందని అంటున్నారని వినికిడి. మరి దర్శక,నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరో ప్రక్క ఈ చిత్రం రిలీజ్ ని తమిళ న్యూ ఇయర్ అయిన ఏప్రియల్ 14న విడుదల చేయాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వారు రజనీకాంత్ తో చర్చిస్తున్నట్లు తెలుస్తోంతంది.

ఆ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని ఇక్కడ చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చెన్నై సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రజనీ డాన్ గా కనిపించనున్నారు. సినిమా కథ మొత్తం మలేషియా బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. షూటింగ్ సింగపూర్ లో ప్లాన్ చేసారు. దర్శకుడు ఎందుకని సింగపూర్, మలేషియా ఎంచుకున్నారు అంటే... అక్కడ ఉన్న ఆసియా దేశాల ముఖ్యంగా ఇండియా లేబర్ ఎక్కువ. అక్కడ వారితో ఓ డాన్ కు ఉన్న రిలేషన్ తో కథ నడవబోతోందని తెలుస్తోంది.

కొన్ని నిజ జీవిత సంఘటనలు కూడా ఈ కథలో చోటు చేసుకోబోతున్నట్లు చెప్తున్నారు. అక్కడ కాంటాక్ట్ లేబర్ పడే ఇబ్బందులు, వారికి డాన్ కు ఉన్న కనెక్షన్ తో కథ నడుస్తోందని చెప్తున్నారు. వారంతా ఈ డాన్ ని దేముడుగా కొలుస్తారని అంటున్నారు. సినిమాలో స్ట్రాంగ్ గా సోషల్ మెసేజ్ ఉండబోతోందని వినికిడి.

Rajini's Kabali: Searching for powerful Telugu Title

ఆరవాన్ లో నటించిన దన్సిక ఈ చిత్రంలో డ్రగ్ ఎడిక్ట్ గా కనపడనుందని సమాచారం. ఆమె రజనీకుమార్తె. దన్సిక మాట్లాడుతూ... దన్సిక మాట్లాడుతూ తను కబాలి చిత్రంలో చేస్తున్నానని, రజనీ తో చేయటం చాలా ఆనందాన్ని ఇస్తోందని చెప్పారు. అలాగే దర్శకుడు దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తండ్రి గజరాజు..ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నట్లు తెలిపారు.

తన ఇమేజ్ ని పట్టించుకోకుండా కథలో ఏమైతే మార్పులో చెయ్యవచ్చో అవన్నీ చేయమని రజనీ..దర్శకుడుకి సూచించినట్లు సమాచారం. చిత్రానికి సంబంధించిన 'ఫ్యాన్స్‌మేడ్‌' ఫొటోలు, పోస్టర్లు మరింత ఆసక్తికరంగా సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే పలురకాల పోస్టర్లు కనిపించగా.. తాజాగా రజనీకాంత్‌ ఒరిజినల్‌ రూపురేఖలతో ఉన్న చిత్ర పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి.

English summary
Rajinikanth, Radhika Apte's ‘Kabali’ Film makers are considering powerful Telugu title to attract all Rajini fans in two Telugu states Telangana and Andhra Pradesh.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu