»   »  రోబో 2.0 హిందీ రైట్స్: రిస్క్ చేయలేమన్న డిస్ట్రిబ్యూటర్స్, తక్కువకే డీల్ క్లోజ్!

రోబో 2.0 హిందీ రైట్స్: రిస్క్ చేయలేమన్న డిస్ట్రిబ్యూటర్స్, తక్కువకే డీల్ క్లోజ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాహుబలి సినిమా హిందీలో రూ. 500 కోట్లు వసూలు చేసింది. ఈ నేపథ్యంలో బాహుబలిని మించి దాదాపు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న రోబో '2.0' సినిమాకు భారీ డిమాండ్ ఉంటుందని అంతా ఊహించారు.

అయితే రోబో 2.0 మూవీకి హిందీ రైట్స్ ఊహించిన స్థాయిలో రాలేదని తెలుస్తోంది. రూ. 100 కోట్లకు తక్కువ కాకుండా హిందీ రైట్స్ అమ్మాలని ప్రయత్నించిన నిర్మాతల ఆశలు అడియాశలే అయ్యాయి. అంత పెద్ద మొత్తం పెట్టి రిస్క్ చేయలేమని చెప్పిన ప్రముఖ బాలీవుడ్ బిస్ట్రిబ్యూషన్ సంస్థలు నిర్మాతలు ఊహించిన దానికంటే తక్కువ రేటుకే డీల్ క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది.

80 కోట్లకు ముగిసిన డీల్

80 కోట్లకు ముగిసిన డీల్

రోబో 2.0 నిర్మాతలు రూ. 100 కోట్ల పై చిలుకు అమౌంట్ హిందీ రైట్స్ కోసం అడిగారని.... అయితే చర్చోపచర్చల అనంతరం రూ. 80 కోట్లకు డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.

లాభాలు వస్తే షేర్ చేసుకునేలా డీల్...

లాభాలు వస్తే షేర్ చేసుకునేలా డీల్...

రూ. 80 కోట్ల హిందీ రైట్స్ డీల్ వెనక మరో ముఖ్యమైన పాయింట్ కూడా ఉందని.... లాభ, నష్టాలు షేర్ చేసుకునేలా ఒప్పందం కుదిరిందని సమాచారం.

అంచనాలు భారీగా

అంచనాలు భారీగా

సాధారణంగానే రజనీకాంత్ సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. శంకర్ లాంటి భారీ చిత్రాల దర్శకుడు కావడం, సినిమా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతుండటంతో అంచనాలు మరింత ఎక్కువగా ఉన్నాయి.

అక్షయ్ కుమార్ కలిసొచ్చే అంశం

అక్షయ్ కుమార్ కలిసొచ్చే అంశం

ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. హిందీలో సినిమాకు భారీ వసూళ్లు రాబట్టాలనే ప్లాన్ తోనే అక్షయ్ కుమార్ ను ఈ చిత్రంలో కీలక పాత్రకు తీసుకున్నారు.

లీకైన ఫోటోస్

లీకైన ఫోటోస్

రోబో 2.0 సినిమకు సంబంధించిన కొన్ని లీక్ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. గతంలో వచ్చిన రజనీకాంత్ రోబో చిత్రాన్ని మించిపోయేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.

అమీ జాక్సన్ కూడా రోబోగా?

అమీ జాక్సన్ కూడా రోబోగా?

లీకైన ఫోటోలు పరిశీలిస్తే ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు హీరోయిన్ అమీ జాక్సన్ కూడా రోబో పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

2018లో భారీ విడుదల

2018లో భారీ విడుదల

2018 జనవరి 25వ తేదీన ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

English summary
It looks like superstar Rajinikanth, Akshay Kumar and Amy Jackson starrer Robo 2.0 is breaking records even befor its release as the Hindi theatrical rights for the movie has been sold to a whopping 80 crores. A leading daily quoted a source by saying, "2.0 makers wanted over INR 100 crore. But the distributors weren't too keen on paying the exorbitant amount because that would make the film risky." The deal was then finalised for 80 crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu