కర్ణాటకలో ప్రభాస్ ను బీట్ చేసిన రజనీకాంత్.. అక్కడ వీరిద్దరితే హవా

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలి చిత్రం ప్రస్తుతం థియేటర్లలోకి వచ్చేసింది. ఆగస్టు 14 నుంచి వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రన్ అవుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్ స్టర్ చిత్రానికి బాక్సాఫీస్ రెస్పాన్స్ కూడా అదిరిపోతోంది. తెలుగు, తమిళం, హిందీ, కర్ణాటకలో వసూళ్లు అదిరిపోతున్నాయి. ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. అయితే రజనీకాంత్ కర్ణాటకలో ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రియేట్ చేసిన రికార్డును కూలి చిత్రంతో సమం చేయడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే..

కర్ణాటకలో కూలి చిత్రం వసూళ్లు..
రజనీకాంత్ కూలి చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర నటించిన సంగతి తెలిసిందే. దానికి తోడు ఇప్పటికే రజనీకాంత్ కు కర్ణాటకలోనూ ఫ్యాన్స్ ఉండటంతో కూలి సినిమాకు మంచి వసూళ్లు అందుతున్నాయి. కూలి రైట్స్ ను AV మీడియా కన్సల్టెన్సీ దక్కించుకుంది. భారీ స్థాయిలో విడుదల చేయడం విశేషం. ఇక కేవలం కన్నడలో కూలి చిత్రానికి ఓపెనింగ్ డే రూ.14 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఇక 2వ రోజుతో ఈ చిత్రం రూ.20 కోట్ల క్లబ్ లోకి చేరుకుంటుంది.

Rajinikanth Reached Prabhas Record in Karnataka with Coolie movie Collections

ప్రభాస్ ను బీట్ చేసిన రజనీ..
అయితే, కర్ణాటక స్టేట్ లో ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలు తమ చిత్రాలతో ఎక్కువ సార్లు వసూల్ చేసింది ప్రభాస్ ఒక్కడే అని కర్ణాటక ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ప్రభాస్ ఇప్పటి వరకు తన 6 చిత్రాలతో కన్నడలో 20 కోట్లు రాబట్టాడంట. ఇక రజనీకాంత్ ఇప్పటి వరకు 5 చిత్రాలతో 20 కోట్ల రూపాయల గ్రాస్ కన్నడ నుంచి అందుకున్నారు. తాజాగా కూలి చిత్రంతో రజనీకాంత్ ఖాతాలోనూ 6 చిత్రాలు చేరాయని కర్ణాటక ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు. ఇక నాన్ కన్నడ స్టార్స్ గా బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్, ప్రభాస్ ఇద్దరూ మంచి వసూళ్లను అందుకుంటున్నారని తెలిపారు.

కూలి డే1 వసూళ్లు..
ఇండియాస్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలి చిత్రానికి వరల్డ్ వైడ్ గా డే1 150 కోట్ల గ్రాస్ అందింది. ఇందులో తమిళ నాడు రూ.29 కోట్లు, ఏపీ+నైజాం రూ.18 కోట్లు, కర్ణాటక రూ.15 కోట్లు, కేరళలో రూ.10 కోట్లు, ROI నుంచి రూ.8 కోట్లు వసూళ్లు చేసింది. ఇక ఓవర్సీస్ లో రూ.76 కోట్లు గ్రాస్ అందింది. ఇక 2వ రోజు వీకెండ్ రావడంతో మరింతగా వసూళ్లు అందే అవకాశం ఉంది.

భారీ బడ్జెట్ తో కూలి..
కూలి చిత్రాన్ని తమిళనాడులోని అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ లో నిర్మాత కళానిధి మారన్ రూ.370 కోట్లతో నిర్మించినట్టు ట్రేడ్ నిపుణులు తెలిపారు. కాగా ఈ చిత్రానికి థియేట్రికల్ రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ కలుపుకొని రూ.550 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక 1000 కోట్ల కలెక్షన్ల దిశగా బాక్సాఫీస్ బరిలోకి దిగిందీ చిత్రం.

More from Filmibeat

Read more about: rajinikanth coolie prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X