Don't Miss!
- Finance
PMCares: PMCares రాజ్యాంగబద్ధమా ? RTI కిందకు వస్తుందా ? విరాళాల సంగతేంటి..??
- News
ఈటలపై అభ్యర్థి ఫిక్స్: ప్రకటించిన కేటీఆర్; గెల్లు శ్రీనివాస్ కు షాక్!!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
చిట్టి దెబ్బకు రికార్డులు బ్రేక్.. రజనీ ఒక్కమాటతో వంద.. 2.0 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇవే!
రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన సైంటిఫిక్ ఫిక్షన్ 2.O చిత్రం వసూళ్ల జైత్రయాత్రను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబడుతూ రికార్డులను తిరుగరాస్తున్నది. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకునే దిశగా పరుగులు పెడుతున్నది. 2.O మూవీ తొలి రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
ప్రపంచవ్యాప్తంగా 2.O మూవీ తొలి రోజున రూ.110 కోట్లు వసూలు చేసింది. భారత్‌లో ఈ చిత్రం రూ.85 కోట్లు రాబట్టింది. శంకర్, రజనీకాంత్ కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్‌గా 2.O మూవీ నిలిచింది అని పీఆర్‌వో వంశీకాక ట్వీట్ చేశారు.

దేశవ్యాప్తంగా 2.O మూవీ హవా
దేశవ్యాప్తంగా పలు భాషల్ల రిలీజైన 2.O మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రం హిందీలో రూ.21 కోట్లు, తమిళంలో రూ.20 కోట్లు, తెలుగులో 19 కోట్లు, కేరళలో రూ.5.5 కోట్లు, కర్ణాటకలో రూ.8 కోట్లు వసూలు చేసింది అని ట్రేడ్ అనలిస్టు శ్రీధర్ పిళ్లై ట్వీట్ చేశారు.
2.O మూవీ రివ్యూ అండ్ రేటింగ్: గ్రాఫిక్స్‌తో ఇంద్రజాలం

వర్కిండే రోజునే భారీగా
వర్కింగ్ డే నాడు 2.O మూవీ హిందీలో రూ.21 కోట్లు రాబట్టడం విశేషంగా చెప్పుకోవాలి. నాన్ హాలీడే, నాన్ ఫెస్టివల్ సమయంలో 2.O మూవీ రిలీజై ఘనంగా దూసుకెళ్తున్నది. డబ్బింగ్ మూవీ అయినందున అడ్వాన్స్ బుకింగ్స్ లేటుగా ప్రారంభమయ్యాయి. కానీ బిజినెస్ మాత్రం బలంగా ఉంది అని సినీ క్రిటిక్, ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.

చెన్నైలో ఆల్‌టైమ్ రికార్డు
చెన్నై బాక్సాఫీస్ వద్ద తొలిరోజున భారీ కలెక్షన్లు సాధించింది. మొదటి రోజున రూ.2.64 కోట్లు వసూలు చేసి సర్కార్ రికార్డును మాయం చేసింది. తమిళ సినిమా పరిశ్రమలో చెన్నైకి సంబంధించి ఇప్పటి వరకు ఇదే రికార్డు అని సినీ వర్గాలు పేర్కొన్నాయి. కేరళలో 4.15 కోట్లు వసూలు చేసి కబాలి రికార్డును అధిగమించింది.

రజనీకాంత్ చెప్పిన మాటే
2.O మూవీ సినిమాకు ముందు సూపర్‌స్టార్ రజనీకాంత్ పదే పదే ఒక మాట చెప్పారు. సినిమాకు ప్రమోషన్ అక్కర్లేదు. ప్రేక్షకులే సినిమాను ముందుకు తీసుకెళ్లి 2.O మూవీని సూపర్ డూపర్ హిట్ చేస్తారు. ప్రమోషన్‌కు డబ్బులు ఖర్చు చేయడం వృథా అని పేర్కొన్నారు.

రిలీజ్‌కు ముందే రాబడి
2.O మూవీ సుమారు రూ.600 కోట్లతో సన్ పిక్చర్స్ రూపొందించింది. శాటిలైట్, డిజిటల్, డిస్ట్రిబ్యూషన్ హక్కుల ద్వారా ఈ చిత్రం రూ.370 కోట్లు విడుదలకు ముందే రాబట్టింది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 10500 స్క్రీన్లలో, దేశవ్యాప్తగా 7000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.