Don't Miss!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
2.O మూవీ కలెక్షన్లు: బాహుబలి, సర్కార్ రికార్డులు బ్రేక్.. టాప్ 1 ప్లేస్‌లో..
Recommended Video

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన 2.O మూవీ తమిళనాడులో వసూళ్ల తడాఖా చూపిస్తున్నది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2డీ, 3డీ వెర్షన్లలో రిలీజైంది. ప్రస్తుతం ఈ చిత్రం హౌస్‌ఫుల్ కలెక్షన్లతో ముందుకెళ్తున్నది. తొలిరోజు కలెక్షన్లు బాహుబలి2, సర్కార్, ఇతర తమిళ చిత్రాల వసూళ్లను అధిగమించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే..

భారీ సంఖ్యలో ప్రదర్శన
తమిళనాడు వ్యాప్తంగా మల్టిప్లెక్స్ చైన్ థియేటర్లలో భారీ సంఖ్యలో సినిమాను ప్రదర్శించారు. ఎస్‌పీఐ సినిమాస్‌లో 110కి పైగా, పీవీఆర్‌లో 90 షోలకు పైగా, ఏజీఎస్ 80కిపైగా, రోహిణి సినిమాస్‌లో 34 షోలకుపైగా, ఐనాక్స్‌లో 34 షోలకు పైగా, కాసీ టాకీస్‌లో 24 షోలకుపైగా, దేవీ, లక్స్ థియేటర్లలో 30కి పైగా స్క్రీన్లలో ప్రదర్శించారు.

చెన్నైలో వసూళ్ల హవా
చెన్నైలో 2.O మూవీకి అనూహ్యమైన స్పందన వ్యక్తమైందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. రోహిణి సిల్వర్ స్క్రీన్స్, వెట్రి థియేటర్స్‌లోనే సుమారు 20 వేలకుపైగా టికెట్లను అమ్మినట్టు సమాచారం. మాయామాల్‌లో 15 వేలకుపైగా ప్రేక్షకులు వీక్షించినట్టు సమాచారం. ఒక చెన్నైలోనే ఈ చిత్రం రూ.2.64 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. సర్కార్ చిత్రం రూ.2.41 కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం.

తొలి రోజే రూ.35 కోట్లు
ట్రేడ్ వర్గాల వెల్లడి ప్రకారం.. తాజా గణాంకాలను అనుసరించి 2.O మూవీ సుమారు రూ.35 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టినట్టు సమాచారం. దాంతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన బాహుబలి2 రికార్డులను అధిగమించినట్టు వెల్లడైంది. బాహుబలి2 సినిమా తొలిరోజు రూ.11 కోట్లు మాత్రమే వసూలు చేయడం తెలిసిందే.
2.O మూవీ లీక్‌పై కోర్టు సీరియస్.. 12 వేలా?.. వాటిని బ్లాక్ చేయాలని వార్నింగ్

టాప్ వన్ ప్లేస్‌లో 2.0
తమిళనాడులో 2.O మూవీ చిత్రం ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నది. తొలిరోజే రూ.35 కోట్లు వసూలు చేసి టాప్ 1 పొజిషన్‌ను నిలబెట్టుకొన్నది. మిగితా సినిమాల కలెక్షన్లు పరిశీలిస్తే.. తమిళనాడులో సర్కార్ రూ.3.15, మెర్సల్ రూ.24.8, కబాలి రూ.21.5, వేదాలం రూ.15.5, తేరి రూ.13.23 కోట్లు వసూలు చేశాయి.