twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీ 2.0.... మార్కెటింగ్ స్ట్రాటజీ కేక, కోట్లు వచ్చి పడుతున్నాయ్!

    సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘2.0’ మూవీ రిలీజ్ ముందే ఎవరూ ఊహించని రికార్డులు క్రియేట్ చేస్తోంది. రూ. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న .

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న '2.0' మూవీ రిలీజ్ ముందే ఎవరూ ఊహించని రికార్డులు క్రియేట్ చేస్తోంది. రూ. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మార్కెటింగ్ కూడా అదే రేంజిలో చేస్తున్నారు.

    అంత ఖర్చు పెట్టి సినిమా చేస్తున్నపుడు.... వసూళ్లు తిరిగి రాబట్టుకునే ఉపాయాలు కూడా చాలా‌నే ఉంటాయి. సినిమాకు ఎంత ఎక్కువ పబ్లిసిటీ చేస్తే అంతగా జనాల్లోకి వెలుతుంది, వారిలో సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. అందుకే సినిమా బడ్జెట్లో రూ. 40 కోట్లు పబ్లిసిటీ కోసమే ఖర్చు చేస్తున్నారు.

    మార్కెటింగ్ స్ట్రాటజీ

    మార్కెటింగ్ స్ట్రాటజీ

    2.0 చిత్రాన్ని రూ. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ సినీ చరిత్రలో ఒక సినిమాకు ఇంత బడ్జెట్ కేటాయించడం కూడా ఇదే తొలిసారి. పెట్టిన బడ్జెట్లో మూడో వంతు(రూ. 110 కోట్లు) శాటిలైట్ రైట్స్ రూపంలోనే రావడం విశేషం. థియేట్రికల్ రైట్స్ రూపంలో కనీసం 500 కోట్లు వస్తాయని అంచనా. రూ. 1000 కోట్ల కలెక్షన్లే లక్ష్యంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.

    ఫస్ట్ లుక్ లాచింగ్ కార్యక్రమం కోసం రూ. 6 కోట్ల ఖర్చు

    ఫస్ట్ లుక్ లాచింగ్ కార్యక్రమం కోసం రూ. 6 కోట్ల ఖర్చు

    ఈ చిత్రం అఫీషియల్ ఫస్ట్ లుక్ నవంబర్ 20న లాంచ్ చేసారు. ముంబైలో గ్రాండ్ ఈవెంట్ గా నిర్వహించిన దీని కోసం ఏకంగా రూ. 6 కోట్లు ఖర్చు చేస్తున్నారట.

    తెలుగు-తమిళం పోటీ

    తెలుగు-తమిళం పోటీ

    సౌత్‌లో నాలుగు సినీ పరిశ్రమలున్నాయి. తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ. ఈ నాలుగు పరిశ్రమల్లో పోటా పోటీ వాతావరణం ఉండేది మాత్రం తెలుగు, తమిళ పరిశ్రమల మధ్యే. బాహుబలి రాక ముందు తమిళ సినిమాలదే పైచేయి. అటు బడ్జెట్ పరంగా చూసుకున్నా, వసూళ్ల పరంగా చూసుకున్నా తమిళ సినిమాలదే పైచేయి ఉండేది. మనకంటే ముందే తమిళ హీరోలు రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయారు. అయితే బాహుబలి వచ్చి అన్ని సౌతిండియా రికార్డులను తుడిచేసింది.

    బాహుబలిని పడగొట్టాలని కసి...?

    బాహుబలిని పడగొట్టాలని కసి...?

    బాహుబలి సినిమా రికార్డులను పడగొట్టాలని తమిళ సినీ వర్గాలు కొంతకాలంగా తెగ ప్రయత్నిస్తున్నాయి. ఆ మధ్య విజయ్ ‘పులి' అనే సినిమా తీసినా అది బాహుబలిని బీట్ చేయలేక పోయింది. తర్వాత ‘ఐ' సినిమా వచ్చింది. అదీ చతికిల పడింది. ఇపుడు బాహుబలిని పడగొట్టడమే లక్ష్యంగా రజనీ 2.0 మూవీ సిద్ధం అవుతోంది.

     శంకర్ కు పూర్వ వైభవం వస్తుందా?

    శంకర్ కు పూర్వ వైభవం వస్తుందా?

    ఒకప్పుడు సౌత్‌లో పెద్ద సినిమాలు, భారీ వసూళ్లు సాధించే సినిమాలు తీసే దర్శకుడు ఎవరంటే శంకర్ పేరు మాత్రమే వినిపించేది. అయితే బాహుబలి తర్వాత శంకర్ పేరు చిన్నబోయింది. రాజమౌళి పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. ఎలాగైనా మళ్లీ టాప్ పొజిషన్లోకి రావాలని రజనీకాంత్ హీరోగా 2.0 చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు శంకర్.

    అక్షయ్ అందుకే

    అక్షయ్ అందుకే

    బాలీవుడ్ మార్కెట్లో సత్తా చాటాలంటే... బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్లే కావాలి. అందుకోసమే దర్శకుడు శంకర్ అక్షయ్ కుమార్ ను విలన్ పాత్రకు ఒప్పించాడు. అక్షయ్ కుమార్ ద్వారా సినిమా ప్రమోషన్లు భారీగా నిర్వహించబోతున్నారు.

     కరణ్ జోహార్‌ను తన వైపుకు తిప్పుకున్నారు

    కరణ్ జోహార్‌ను తన వైపుకు తిప్పుకున్నారు

    ఇక బాలీవుడ్లో బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు సాధించే టెక్నిక్స్ బాగా తెలిసిన దర్శక నిర్మాత కరణ్ జోహార్. బాహుబలి సినిమా విషయంలో కరణ్ జోహార్ స్వయంగా రంగంలోకి దిగడం వల్లనే అక్కడ భారీ విజయం సాధించి, కోట్ల వర్షం కురిపించింది. ఆ కారణంగానే కరణ్ జోహార్ తమ వైపుకు తిప్పుకుని 2.0 సినిమా కోసం రంగంలోకి దింపుతున్నారు.

    English summary
    In what could be a biggest-ever TV deal in Indian cinema, the satellite rights of Rajinikanth and Shankar's 2.0 have been sold for a staggering 110 Crore. Zee TV has bagged the TV rights of the film for this staggering price. It's said that the deal includes the rights of Telugu, Tamil and Hindi versions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X