»   » రాజగారి గది 2: నాగార్జున-సమంత మూవీ ఫైనల్ షేర్ ఎంతో తెలుసా?

రాజగారి గది 2: నాగార్జున-సమంత మూవీ ఫైనల్ షేర్ ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగార్జున, సమంత ప్రధాన పాత్రలో రూపొందిన హారర్ కామెడీ థ్రిల్లర్ 'రాజుగారి గది 2'. ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సక్సెస్ టాక్ తెచ్చుకుంది. అక్టోబర్ 13న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు రన్ దాదాపుగా ముగిసింది.

ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ నాగార్జున గత సినిమా 'సోగ్గాడే చిన్ని నాయనా' కలెక్షన్ రికార్డులను బ్రేక్ చేయడంలో విఫలమైంది. రాజుగారి గది 2 వరల్డ్ వైడ్ షేర్ రూ. 18.14 కోట్లు వసూలు చేసింది. ఏరియా వైజ్ కలెక్షన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.


నైజాం ఏరియాలో

నైజాం ఏరియాలో

నైజాం ఏరియాలో ‘రాజుగారి గది 2' మూవీ రూ. 6.25 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించింది. నాగార్జున, సమంత కాంబినేషన్ కాబట్టి ఇంకా ఎక్కువ వస్తుందని ఆశించారు, కానీ అనుకున్న అంచనాలను సినిమా అందుకోలేక పోయింది.


సీడెడ్

సీడెడ్

సీడెడ్ ఏరియాలో ‘రాజుగారి గది 2' మూవీ రూ. 2.60 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ ప్రాంతంలో మూవీ కలెక్షన్ సంతృప్తికరంగా ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.


ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర ఏరియాలో రాజుగారి గది 2 మూవీ ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేదు. ఈ చిత్రం ఇక్కడ రూ. 1.70 కోట్లు మాత్రమే వసూలు చేసింది.


కోస్తా జిల్లాల్లో

కోస్తా జిల్లాల్లో

గుంటూరులో రూ. 1.25 కోట్ల షేర్, ఈస్ట్ గోదావరి జిల్లాలో రూ. 1.18 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 77 లక్షలు, కృష్ణ జిల్లాల్లో రూ. 1.15 కోట్లు, నెల్లూరులో రూ. 49 లక్షలు వసూలు చేసింది.


ఓవరాల్ కలెక్షన్

ఓవరాల్ కలెక్షన్

ఓవరాల్ ఏపీ-తెలంగాణలో ఈ చిత్రం రూ. 15.39 కోట్లు వసూలు చేసింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.05 కోట్లు రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 18.14 కోట్ల షేర్ ఈ చిత్రం రాబట్టింది.


English summary
Akkineni Nagarjuna's Raju Gari Gadhi 2 has made decent collection at the box office in its lifetime. The movie collected Rs.18.14 cr share world wide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu