»   » దొందూ దొందే...ఆ రెండు చిత్రాలూ ఫ్లాఫే (ట్రేడ్ టాక్)

దొందూ దొందే...ఆ రెండు చిత్రాలూ ఫ్లాఫే (ట్రేడ్ టాక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొన్న శుక్రవారం 'రక్త చరిత్ర 2", 'ఆలస్యం.. అమృతం" విడుదలయ్యాయి. అయితే రెండూ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. మొదటి పార్ట్ విజయవంతం కావటంతో ఎంతో ఆసక్తి రేపిన 'రక్త చరిత్ర 2" ఆ రేంజి కథ, కథనం లేకపోవటంతో ఫ్లాఫ్ గా సెటిలైంది. ఇక సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన 'ఆలస్యం.. అమృతం" ఓ స్టేజి డ్రామాలా మారి బోర్ రావటంతో ఉన్న కొద్దిపాటి కామిడీని కూడా ఎంజాయ్ లేకపోయామంటున్నారు. యేలేటి ప్రణాయం చిత్రం స్పూర్తితో అంతా రైల్వే స్టేషన్ లోనే జరిగే కథతో చంద్రమహేష్ దర్శకత్వంలో నిఖిల్, మదాల్సశర్మ జంటగా నటించిన ఈ చిత్రం ఫ్లాప్ గానే మిగిలిపోయింది. ఇక గత వారం విడుదలైన రామ్‌ చరణ్ 'ఆరెంజ్" కలెక్షన్లు పూర్తిగా పడిపోగా, 'కర్మ" కూడా ప్రేక్షకులుకు ఏం ఖర్మ అనిపిస్తోంది. ఇక ఈ రోజు(శుక్రవారం) అల్లరి నరేష్ కత్తి కాంతారావు, అల్లరి రవిబాబు మనసారా చిత్రాలు విడుదల అవుతున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu