»   »  'బ్రూస్ లీ' 50 డేస్..ఎన్ని సెంటర్లలలో?

'బ్రూస్ లీ' 50 డేస్..ఎన్ని సెంటర్లలలో?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లు జంటగా నటించిన చిత్రం 'బ్రూస్‌లీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డి.వి.వి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. థమన్‌ సంగీతం అందించారు. దసరా సందర్భంగా అక్టోబర్ నెల 16న 'బ్రూస్‌లీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ చిత్రం మార్నింగ్ షో కే ఫ్లాఫ్ అని తేలింది. ఇప్పడు కేరళలో భారీగా అంటే 60 ధియోటర్స్ లో నవంబర్ 27న విడుదలైంది. ఈ చిత్రం శుక్రవారం నాటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. మూడు సెంటర్లలలో యాభై రోజులు వేసారు. ఆ సెంటర్లు ఇవి...


Ram Charan's Bruce Lee 50 days in 3 centers only

కర్నూలు
ఎమ్మిగినూరు
మదనపల్లి


మళయాళంలోనూ అదే టైటిల్ తో విడుదల చేసారు. తమిళ రైట్స్ తీసుకున్న భధ్రకాళి ఫిల్మ్స్ వారే మళయాళంలోనూ విడుదల చేసారు. కేరళలోనూ ఈ సినిమా జస్ట్ ఓకే టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో ఆల్రెడీ ఫ్లాఫ్ టాక్ రావటంతో అక్కడా పెద్దగా హైప్ రాలేదు.


చిత్రం కథేమిటంటే.....


అందరూ లక్ష్యం వైపే పరుగెడతారు...కొందరు మాత్రమే తన వాళ్ల కోసం నిలబడతారు..అటువంటి వారిలో ఒకడు బ్రూస్ లీ (రామ్ చరణ్). అక్క (కీర్తి కర్బంద) అంటే ప్రాణంగా పెరిగిన బ్రూస్ లీ... చిన్నప్పటి నుంచీ ఆమె కోసం తన చదువును,కెరీర్ ని సైతం త్యాగం చేస్తాడు. ఆమె కలెక్టర్ కావాలని తన తండ్రికి ఇష్టం లేకపోయినా చదువుకు ఫుల్ స్టాఫ్ పెట్టి స్టంట్ మ్యాన్ గా లైఫ్ ప్రారంభిస్తాడు. అంతేకాకుండా తప్పుడు కేసు పెట్టి తన అక్క కలెక్టర్ అవ్వాలనే లక్ష్యంకు అడ్డుపడబోయిన దీపక్ రాజ్ (అరుణ్ విజయ్)కు బుద్ది చెప్తాడు.


ఇలా అక్క...తను అన్నట్లు నడుస్తూండగా.. ఓ ట్విస్ట్. తన తండ్రి (రావు రమేష్) పని చేసే సంస్ధ యజమాని జయరాజ్(సంపత్ రాజ్), నదియాల కుమారుడుతో వివాహం నిశ్చియం అవుతుంది. అయితే జయరాజ్ పైకి కనిపించినంత మంచి వాడు కాదు. అతనికో దుర్మార్గమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అది దాచి పెద్దమనిషిలా చెలామణి అవుతూంటాడు. అది తెలిసిన హీరో...ఆ విషయాన్ని ఎలా బయిటపెట్టి, విలన్ కు ఎలా బుద్ది చెప్పాడు. కథలో రియా (రకుల్) పాత్ర ఏమిటి... చిరు ఎంట్రీ ఏమిటి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

English summary
Ram Charan's ‘Bruce Lee’ had completed its 50 days run by this Friday.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu