వారెవా.. రంగస్థలం సూపర్ రికార్డు.. హైదరాబాద్, నైజాంలో బీభత్సమే..
Recommended Video

తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలం చిత్రానికి సంబంధించిన కలెక్షన్ల హవా ఇంకా కొనసాగుతునే ఉంది. ప్రధానంగా నైజాంలో ఈ చిత్రం రెండు అరుదైన రికార్డులను సొంతం చేసుకొన్నది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం సింగిల్ థియేటర్ల అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా, అలాగే నైజాంలో బాహుబలి తర్వాత భారీ కలెక్షన్లను కొల్లగొట్టిన చిత్రంగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నది.

సింగిల్ థియేటర్లో హవా!
మల్టీప్లెక్స్ థియేటర్లు వచ్చిన తర్వాత సింగిల్ థియేటర్లను పట్టించుకొన్న దాఖాలాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. కానీ రంగస్థలం ఆ విషయాన్ని పక్కన పెట్టింది. ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్లలో రూ.1,61,49,911 గ్రాస్ వసూళ్లను సాధించింది.

12 ఏళ్ల రికార్డుకు చెక్
తెలంగాణలో ఓ సింగిల్ థియేటర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రంగస్థలం ఓ రికార్డు క్రియేట్ చేసింది. గతంలో ఈ రికార్డు సూపర్‌స్టార్ మహేష్‌బాబు నటించిన పోకిరి చిత్రంపై ఉండేది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆ రికార్డును రంగస్థలం తుడిపేసింది. ఈ కలెక్షన్లు రాంచరణ్ స్టామినాను చూపించాయి.

టాప్ 5 మూవీస్ ఇవే
తెలంగాణలో సింగిల్ థియేటర్లలో అత్యధికంగా వసూళ్లను సాధించిన టాప్ 5 చిత్రాలు ఇవే.
రంగస్థలం రూ. 1,61,49,911
పోకిరి రూ. 1,61,43,091
నువ్వే కావాలి 1,58,41,594
ఖుషీ: రూ.1.56 కోట్లు
బాహుబలి: రూ. 1,52,20,489

నైజాంలో పవన్ కల్యాణ్ రికార్డు బ్రేక్
ఇదిలా ఉండగా, నైజాంలో రంగస్థలం చిత్రం మరో అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. 2013లో పవన్ కల్యాణ్ చిత్రం అత్తారింటికి దారేది నైజాంలో సాధించిన రూ.25 కోట్ల షేర్ రికార్డును ఈ చిత్రం అధిగమించింది. నైజాంలో రూ. 28.5 కోట్లు వసూలు చేయడం ఓ రికార్డు. బాహుబలి తర్వాత రంగస్థలం మాత్రమే ఈ ఘనతను సాధించింది.

ఆంధ్రాల్లో రాంచరణ్ సత్తా
ఇక ఆంధ్రాలో రంగస్థలం జోరు బాగానే కనిపించింది. కృష్ణా జిల్లాలో రాంచరణ్ నటించిన ఈ చిత్రం రూ.1 కోటికిపైగా వసూలు చేయడం ఓ రికార్డుగా పేర్కొంటున్నారు. ఇలా రంగస్థలం రికార్డుల పరంపర కొనసాగిస్తూ ట్రేడ్ మార్కును సెట్ చేసింది.


Click it and Unblock the Notifications











