»   » కలెక్షన్ రిపోర్ట్: చిట్టిబాబు జోరును ఆపలేక పోతున్న ‘కృష్ణార్జున యుద్ధం’

కలెక్షన్ రిపోర్ట్: చిట్టిబాబు జోరును ఆపలేక పోతున్న ‘కృష్ణార్జున యుద్ధం’

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద మూడో వారంలోనూ మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. ఈ వారం నాని హీరోగా తెరకెక్కిన 'కృష్ణార్జున యుద్ధం' విడుదలైనా చిట్టి బాబు జోరుకు కళ్లెం వేయలేక పోయింది. నాని సినిమాకు మిక్డ్స్ రివ్యూస్, యావరేజ్ అనే మౌత్ టాక్ రావడంతో ఈ సినిమాకు బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రావడం లేదు. ఇంక అంతకు ముందు వారం విడుదలైన ఛల్ మోహన్ రంగ చిత్రం పూర్తిగా డల్ అయిపోయింది.

 రంగస్థలం యూఎస్ఏలో ఇప్పటి వరకు

రంగస్థలం యూఎస్ఏలో ఇప్పటి వరకు

రంగస్థలం విడుదలైన వారం తర్వాత నితిన్ మూవీ ‘ఛల్ మోహన్ రంగ'తో పాటు మరికొన్ని చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అయితే ఆ చిత్రాలు పెద్దగా పోటీ ఇవ్వక పోవడంతో రెండో వారం $502,380 వసూలు చేసింది. దీంతో యూఎస్ఏలో రామ్ చరణ్ మూవీ ఓవరాల్ 14 రోజల టోటల్ కలెక్షన్ $3,246,997కు చేరుకుంది.


నాని మూవీ అంచనాలు తారుమారు

నాని మూవీ అంచనాలు తారుమారు

నాని వరుస విజయాలతో మంచి జోరు మీద ఉండటం, అతడి సినిమాలకు యూఎస్ఏ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో ‘కృష్ణార్జున యుద్ధం' రాకతో ‘రంగస్థలం' జోరుతగ్గుతుందని అంతా భావించారు. ‘కృష్ణార్జున యుద్ధం' ప్రీమియర్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ మౌత్ టాక్ యావరేజ్ అని రావడంతో డీలా పడిపోయింది.


ఎంసీఏ కంటే తక్కువగా

ఎంసీఏ కంటే తక్కువగా

నాని గత చిత్రం ‘ఎంసీఏ' కంటే ‘కృష్ణార్జున యుద్ధం' చిత్రం ఎక్కువ స్క్రీన్లలో విడుదలైంది. అయితే ‘ఎంసీఏ' చేసినన్ని వసూళ్లు ఈ చిత్రం సాధించలేక పోయింది. బుధవారం ప్రీమియర్ షోలతో కలిపి శుక్రవారం నాటికి కృష్ణార్జున యుద్ధం 157 లొకేషన్ల నుండి $303,404 వసూలు చేయగా, ఏంసీఏ కేవలం ప్రీమియర్ షోల ద్వారానే $304k వసూలు చేసి శుక్రవారం నాటికి $533k సాధించింది.


 16వ (శనివారం) రోజు రిపోర్ట్

16వ (శనివారం) రోజు రిపోర్ట్

సినీ విశ్లేషకులు జీవీ చెప్పిన వివరాల ప్రకారం.... శనివారం మధ్నాహ్నం 12.20 నాటికి అందిన సమాచారం ప్రకారం కృష్ణార్జున యుద్ధం 105 లొకేషన్లలో ప్రదర్శితం అవుతూ $20,128 వసూలు చేయగా, రంగస్థలం 48 లొకేషన్లలో ప్రదర్శితం అవుతూ $13,585 రాబట్టింది. ఛల్ మోహన్ రంగ 15 లొకేషన్లలో రన్ అవుతూ $1,047 వసూలు చేసింది.


English summary
Ram Charan's Rangasthalam is undeterred by Nani's new release Krishnarjuna Yuddham and continued to make a good collection at the US box office in its third week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X