»   » మహేష్ తో పోటికి సై అంటున్న రామ్ చరణ్

మహేష్ తో పోటికి సై అంటున్న రామ్ చరణ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'నాయక్‌' చిత్రాలు విజయాల్ని సొంతం చేసుకొన్నాయి. ఆ వూపు వేసవి వరకు కొనసాగింది. వచ్చేసారి కూడా అదే తరహా ఫలితంకోసం ఎదురు చూస్తోంది తెలుగు చిత్ర పరిశ్రమ. నెల క్రితం వరకు కూడా వచ్చే సంక్రాంతి బరిలో మహేష్‌బాబు, అల్లు అర్జున్‌ మాత్రమే నిలిచేలా కనిపించారు. ఇప్పుడు మాత్రం మరికొందరు హీరోలు వారితో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ 'ఎవడు' చిత్రాన్ని సంక్రాంతికి పోటీ పెడతానని చెప్పటంతో అందరిలో ఆసక్తి కలిగింది.


తను నటించిన 'ఎవడు' చిత్రాన్ని డిసెంబర్ నెలఖరున కానీ, సంక్రాంతికి కానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు రామ్‌చరణ్ వెల్లడించారు. తిరుమలలో ఆయన సతీమణి ఉపాసనతో కలిసి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఈ విషయమై మాట్లాడారు. తదుపరి చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రారంభమవుతుందన్నారు.

తెలుగు సినిమాకీ, సంక్రాంతి పండగకీ మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. విడుదలైన సినిమాలు ఎలా ఉన్నా... ఈ పండగ పూట మాత్రం బాక్సాఫీసు గల్లాపెట్టెలు నిండిపోతుంటాయంతే. అందుకే... దర్శకనిర్మాతలు తమ సినిమాలని సంక్రాంతి బరిలో నిలపాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అలా వచ్చే ముగ్గుల పండక్కి చాలా సినిమాలు ముస్తాబవుతున్నాయి. మరో ప్రక్క 'హార్ట్‌ఎటాక్‌' సినిమాతో నితిన్‌, 'రేయ్‌'తో చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ రాబోయే సంక్రాంతికి రాబోతున్నట్టు దర్శకనిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. దీన్నిబట్టి చూస్తే ఈసారి సంక్రాంతి బరి మరింత హోరాహోరీగా సాగేలా కనిపిస్తోంది.

అయితే సంక్రాంతి పోటిని తట్టుకోవటం కన్నా ముందే వచ్చేయటం బెస్ట్ అని కొందరు ఆలోచేస్తూంటారు. తాజాగా అలాంటి ప్లానే బిర్యాని నిర్మాతలు చేస్తున్నారు. హన్సిక, కార్తీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'బిర్యాని'. ఈ చిత్రం డిసెంబర్ 20 న విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మొదట్లో ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామనుకున్నారు. కానీ సడెన్ గా ప్లాన్ మార్చి ముందే వచ్సేస్తోంది. థియోటర్స్ ఇబ్బంది,పెద్ద సినిమాల మధ్య ఈ సినిమాకు సమస్య ఎదురుతుందనే ఆలోచనలతో ఈ సినిమాని ముందుగా తీసుకువస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో హన్సిక జర్నలిస్ట్ గా కనిపించనుంది. రీసెంట్ గా ఈ చిత్రానికి సంభందించి స్టిల్స్ విడుదల చేసారు. అవి అభిమానులను ఓ రేంజిలో ఆకర్షిస్తున్నాయి.

English summary

 As expected Ram Charan’s Yevadu has been postponed from 19th December, informed our reliable sources. According to Dill Raju’s camp Sankarti has proven lucky for them from a long time and Raju who holds strongly on sentiments is planning to release Yevadu in Jan, 2014. There are multiple reasons along with sentiment for Dil Raju to delay Yevadu release from December to January. A new trailer will be released along with the release date very soon, said sources as an indication for movie buffs along with a official press note referring release date of the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu