Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
The Warriorr: రామ్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు.. నమ్మకంతో ఆ ఏరియా హక్కులు సొంతం
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత తన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. అప్పటివరకు రామ్ అంటే కేవలం లవ్ స్టోరీ సినిమాలతోనే సక్సెస్ అందుకునే హీరో అనే ఒక ముద్రను కూడా చేరిపేశాడు. ఇక తదుపరి సినిమాలతో కూడా రామ్ బాక్సాఫీస్ వద్ద విభిన్నమైన స్థాయిలో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.
ప్రస్తుతం అందరి ఫోకస్ కూడా ది వారియర్ సినిమా పైనే ఉంది. లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ పోతినేని ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా సినిమాపై అంచనాల స్థాయిని పెంచేసింది. అయితే ఈ సినిమాపై హీరో రామ్ కు కాన్ఫిడెన్స్ మామూలుగా లేదని అర్థమవుతోంది.

ఈ సినిమాను తమిళంలో కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ది వారియర్ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటుంది అని రామ్ పోతినేని ఒక ఏరియా హక్కులను కూడా సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో ది వారియర్ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక రామ్ వైజాగ్ ఏరియా హక్కులను సొంతం చేసుకొని భారీగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఆ ఏరియా హక్కుల కోసం కొంతమంది బడా డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆసక్తి చూపించారు. కానీ గత కొంతకాలంగా రామ్ సినిమాలు వైజాగ్ ఏరియాలో మంచి లాభాలను అందిస్తున్నాయి. ఇక డిమాండ్ ను బట్టి రామ్ వైజాగ్ ఏరియా హక్కులను దక్కించుకుని సొంతంగా విడుదల చేసుకోబోతున్నాడు. దీన్ని బట్టి రామ్ ఈ సినిమాను ఎంతగా నమ్ముతున్నాడో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందట. ఇక దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాకు హైలెట్ కాబోతోంది. ఇప్పటికే బుల్లెట్ సాంగ్ భారీ స్థాయిలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక ది వారియర్ సినిమాను జూలై 14 వ తేదీన విడుదల చేయబోతున్నారు.