13 years of ready: కళ్ళు చేదిరేలా కలెక్షన్స్ అందించిన సినిమా.. రామ్ కెరీర్ బెస్ట్ హిట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేటు తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఏకైక హీరో రామ్ పోతినేని. దేవదాసు సినిమాతో హీరోగా పరిచయమైన రామ్ ఆ సినిమతో మంచి హిట్ అందుకున్నాడు. అనంతరం జగడం డిజాస్టర్ అవ్వడంతో నెక్స్ట్ ఎలాగైనా హిట్ అందుకోవాలని రెడీ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా విడుదలైన నేటికి 14ఏళ్లవుతోంది. సినిమా కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

కథకు సెట్టయ్యే హీరోలనే

కథకు సెట్టయ్యే హీరోలనే

శ్రీనువైట్ల అప్పట్లో మంచి డిమాండ్ ఉన్న దర్శకుడు. వరుసగా కామెడీ సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటు వచ్చారు. ఇక ఢీ సినిమా హిట్టుతో స్టార్ హీరోల నుంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ శ్రీనువైట్ల కథకు సెట్టయ్యే హీరోలనే ఎంచుకుంటూ వెళ్ళాడు. దుబాయ్ శీను అనంతరం రెడీ కథ కోసం అగ్ర హీరోలు సిద్ధంగా ఉన్నప్పటికీ రామ్ తోనే తెరకెక్కించాడు.

 బెస్ట్ కాంబినేషన్ లో..

బెస్ట్ కాంబినేషన్ లో..

రామ్ పోతినేని - జెనీలియా జంటగా నటించిన ఆ సినిమాను రామ్ హోమ్ ప్రొడక్షన్ శ్రీ స్రవంతి మూవీస్ లోనే నిర్మించారు. సినిమాకు గోపి మోహన్ - కోన వెంకట్ రైటర్స్ గా వర్క్ చేశారు. అప్పట్లో వారు ఎలాంటి సినిమాలు రాసినా కూడా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకుంటూ వచ్చాయి.

హౌజ్ ఫుల్ కలెక్షన్స్

హౌజ్ ఫుల్ కలెక్షన్స్

రెడీ సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి కామెడీ సినిమాలు వచ్చి అప్పటికి కొంత గ్యాప్ వచ్చింది. ఇక ఫైనల్ గా రెడీ సినిమా సమ్మర్ చివరిలో రావడంతో ఒక్కసారిగా ఫ్యామిలీ అడియేన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు రెండవ రోజు నుంచి హౌజ్ ఫుల్ కలెక్షన్స్ వచ్చాయి.

Recommended Video

#Watch : Hero Simbu New Look In ATMAN Movie
 మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..

మొత్తం కలెక్షన్స్ ఎంతంటే..

ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం కూడా మేజర్ ప్లస్ పాయింట్. ఇక సినిమాను మొత్తంగా 8కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద 17కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. దేవదాసు అనంతరం రామ్ మరో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడంతో అప్పట్లో అగ్ర దర్శకుల నుంచి ఆఫర్స్ గట్టిగానే వచ్చాయి. అయినప్పటికీ రామ్ చాలా నెమ్మదిగా తనకు సెట్టయిన కథలను మాత్రమే చేసుకుంటూ వచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X